ఇక అమెరికా పనైపోయింది..? ఈ యుద్ధం ఆగదు..
Breaking News
తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు
Published on Sat, 04/04/2026 - 20:41
యాంకర్ రష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే 'జబర్దస్త్' కామెడీ షోకు హోస్ట్‌గా చాన్నాళ్ల నుంచి చేస్తూనే ఉంది. కానీ రీసెంట్ టైంలో ఈమెకు పలు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు ఆత్మీయులని కోల్పోవడం తదితర కారణాల వల్ల సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించలేదు. వారం పదిరోజుల క్రితం కాశీ వెళ్లొచ్చిన ఈమె.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్)
'నా నవ్వు చూసి చాలామంది ప్రశ్నించొచ్చు. వారణాసి పర్యటనలో ఇది నా చివరిరోజు. కాశీకి రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. గతంలో కాశీ వెళ్లినప్పుడు నా మనసు చాలా భారంగా ఉంది. ఏం చేయాలో తోచని దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. చాలా తక్కువ సమయంలో చాలామందిని కోల్పోయాను. ఆ బాధ భరించడం నా వల్ల కాలేదు. ఆ జ్ఞాపకాలని వదిలిపెట్టలేకపోతున్నాను. దేవుడి సంకల్పం లేనిదే ఏ ఆధ్మాత్మిక యాత్ర సాధ్యపడదు. ఏదీ మన చేతుల్లో లేదు. నిజమే నా మొదటి పర్యటనకు ఇప్పటికే చాలా మార్పు కనిపిస్తోంది. మనషులని కోల్పోవడమనేది మనిషి అనుభవంలో, పరిణామ క్రమంలో ఓ భాగమని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు నేనే చాలా మెరుగ్గా అనిపిస్తున్నాను' అని రష్మి రాసుకొచ్చింది.
2023లో నానమ్మని కోల్పోయిన రష్మి.. తర్వాత ఏడాది తాతని కోల్పోయింది. అలానే భుజానికి సర్జరీ జరగడం లాంటివి ఈమెలో దైవచింతనని పెంచాయి. అలా కాశీ వెళ్లివస్తోంది. ఈ క్రమంలోనే పలు ఫొటోలని షేర్ చేసి, తన మనసులోని బాధని కాస్తంత బయటపెట్టింది. అలానే మనుషులని కోల్పోవడం జీవితంలోని ఓ భాగమని అర్థం చేసుకుంది.
(ఇదీ చదవండి: యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్)
Tags : 1