Breaking News

రామాయణలో మరో పవర్‌ఫుల్‌ పాత్రలో రణ్‌బీర్‌

Published on Sat, 04/04/2026 - 11:40

భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా చాలా సినిమాలు ఇప్పటికే అలరించాయి. ఈ క్రమంలో  హిందీలో  ‘రామాయణ’ చిత్రాన్ని  నితీష్‌ తివారీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్‌ నటిస్తున్నారు. అయితే, ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా ఈ మూవీ గురించి  రణ్‌బీర్‌ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.  ఇందులో తను ద్విపాత్రాభినయం చేసినట్లు పేర్కొన్నారు.  ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్, డీఎన్‌ఈజీ సంస్థ, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ పతాకాలపై భారీ బడ్జెట్‌తో నమిత్‌ మల్హోత్రా ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.

ఒక వేదికపై రణ్‌బీర్‌ మాట్లాడుతూ రామాయణ చిత్రంలో శ్రీరాముడి పాత్రతో పాటు పరశురాముడిగా కూడా నటిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ మహావిష్ణువు ఆరో అవతారం పరశురాముడిగా కూడా నటించే ఛాన్స్‌ తనకు రావడం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.  ఒక నటుడిగా, హావభావాలతో పాటు ఆ పాత్రల వెనుక దాగిన ఆధ్యాత్మికతను, భావోద్వేగాలను లోతుగా అర్థం చేసుకున్నానని తెలిపారు. రామాయణం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు సుమారు ఏడాది పాటు సమయం కేటాయించానని ఆయన అన్నారు.
 

Videos

గజ్వేల్‌లో టెన్షన్ టెన్షన్ KCR క్యాంప్ కార్యాలయంపై దాడి

ప్రజల కోసం అసెంబ్లీ నక్సలైట్ అవుతా

నాగేంద్రను స్టేషన్ కు పిలిచి విచారించాలి

ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నేలమట్టం! ఇరాన్ షాకింగ్ ప్రకటన

SHOCKING CCTV FOOTAGE: వామో ఏంటి ఇది కొట్టులో విక్స్ కొనడానికి వచ్చి...

వెంకన్న స్వామిపై భక్తి కంటే BR నాయుడుపై చంద్రబాబుకు ప్రేమ ఎక్కువ

రోడ్లు ఖాళీ ఎండ దెబ్బకు.. లాక్ డౌన్ పరిస్థితి

ఇంకెప్పుడు రాజీనామా! BR నాయుడుపై కట్టలు తెగిన ఆగ్రహం

ఇరాన్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలకు ఇక చుక్కలే..

BR నాయుడు అంటే ఎందుకు అంత భయం చంద్రబాబు

Photos

+5

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)

+5

సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)

+5

‘బైకర్‌’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)