థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
సిమ్ బైండింగ్ గడువు పొడిగింపు
Published on Fri, 04/03/2026 - 08:55
వాట్సాప్, టెలిగ్రాం, సిగ్నల్‌లాంటి మొబైల్ మెసేజింగ్ యాప్‌లను తప్పనిసరిగా సిమ్‌తో అనుసంధానం చేసేందుకు విధించిన డెడ్‌లైన్‌ని కేంద్రం డిసెంబర్ 31 వరకు పొడిగించింది. పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సిమ్ బైండింగ్ నిబంధన ప్రకారం మొబైల్‌లో సిమ్ యాక్టివ్‌గా ఉంటేనే మెసేజింగ్ ప్లాట్‌ఫాంలు సర్వీసులు అందించాల్సి ఉంటుంది.
2025 నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆపరేటర్లు దీన్ని ఫిబ్రవరి 26 నుంచి అమలు చేసి, మార్చి 28 నాటికి టెలికం శాఖకు నివేదికనివ్వాలి. సాధారణంగా సిమ్‌ని తొలగించినా, డీయాక్టివేట్ చేసినా లేదా విదేశాలకు వెళ్లిపోయినా, దానితో ముడిపడి ఉన్న ఇన్‌స్టంట్ మెసేజింగ్, కాలింగ్ యాప్‌లు పని చేస్తూనే ఉండటాన్ని అలుసుగా తీసుకుని సైబర్‌క్రిమినల్స్ నేరాలకు పాల్పడుతున్నారు. వాటిని అడ్డుకునేందుకే తాజా నిబంధనను ఉద్దేశించారు.
ఇదీ చదవండి: ఆంత్రోపిక్ సోర్స్ కోడ్ లీక్!
Tags : 1