థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
లక్ష్యంతో మారే పర్సనాలిటీ!
Published on Fri, 04/03/2026 - 08:08
చాలామందికి 'గోల్' (Goal) కి 'పర్పస్' (Purpose) కి తేడా తెలియదు. గోల్ అనేది మీరు 'ఏమి' సాధించాలనుకుంటున్నారు అనేది చెబితే, పర్పస్ అనేది మీరు అది 'ఎందుకు' సాధించాలనుకుంటున్నారు అని చెబుతుంది. ఒక బలమైన ఉద్దేశ్యం (Purpose) ఉంటే, మీ పర్సనాలిటీ ఒక సామాన్యుడిలా ఉండదు.. అది ఒక 'మిషన్' లా మారుతుంది. సైకాలజీలో దీనిని'Sense of Purpose'అంటారు.
విక్టర్ ఫ్రాంక్ల్ (Viktor Frankl) అనే సైకాలజిస్ట్, నాజీ కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో మరణానికి దగ్గరగా ఉండి కూడా బ్రతికి బయటపడ్డారు. ఆయన కనిపెట్టిన సత్యం ఏంటంటే..."ఎవరి జీవితానికైతే ఒక అర్థంఉంటుందో, వారు ఎలాంటి కష్టాన్నైనా భరించగలరు."మీ పర్సనాలిటీని ఒక అయస్కాంతంలా మార్చే శక్తి ఈ 'పర్పస్'కు ఉంది.
పర్పస్ ఉంటే మీలో వచ్చే మార్పులు (Psychological Shifts): ఒక ఉద్దేశ్యం ఉన్న వ్యక్తి పర్సనాలిటీలో ఈ మూడు స్పష్టంగా కనిపిస్తాయి.
Laser Focus: మీకు పర్పస్ ఉన్నప్పుడు, అనవసరమైన పనులు, గాసిప్స్, డిస్ట్రాక్షన్స్ మీకు చిన్నవిగా కనిపిస్తాయి. మీ సమయం దేనికి ఖర్చు చేయాలో మీకు స్పష్టత ఉంటుంది.
Resilience: సమస్యలు వచ్చినప్పుడుపర్పస్ లేనివాడు కుంగిపోతాడు. కానీ పర్పస్ ఉన్నవాడు "ఇది నా ప్రయాణంలో ఒక భాగం మాత్రమే" అని మరింత బలంగా లేస్తాడు.
Gravitas: మీ మాటల్లో, నడకలో ఒక రకమైన 'బరువు' వస్తుంది. మీరు ఏదో సాధించడానికి పుట్టారు అనే నమ్మకం ఎదుటివారికి మీ ప్రెజెన్స్ ద్వారానే అర్థమవుతుంది.
గోల్ vs పర్పస్: తేడా ఏంటి?
గోల్ అనేది ఒక మైలురాయి అయితే, పర్పస్ అనేది ఒక దిక్సూచి (Compass). "నేను ఒక కోటి రూపాయలు సంపాదించాలి" లేదా "నేను ఈ పదవిని అందుకోవాలి"అనే గోల్ ఇది సాధించగానే ఆగిపోతుంది. కానీ "నేను నా జ్ఞానంతో ఒక లక్ష మంది జీవితాలను మార్చాలి" అనే పర్పస్ నిరంతరం సాగుతుంది.
మోటివేషన్ మాయ vs పర్పస్ డ్రివెన్ పవర్
మోటివేషన్ బయట నుండి వచ్చే 'కిక్'. వీడియో చూస్తే వస్తుంది, కాసేపయ్యాక పోతుంది. పర్పస్ లోపల నుండి వచ్చే 'జ్వాల'. ఎవరూ మిమ్మల్ని ప్రోత్సహించకపోయినా, పరిస్థితులు బాగోకపోయినా ఇది మిమ్మల్ని నిద్రపోనివ్వదు.
మీ పర్పస్ ని ఎలా కనుక్కోవాలి?
పర్పస్ ఫుల్ పర్సనాలిటీగా మారడానికి మూడంచెలు...
Step 1: Break Selfish Thoughts
కేవలం "నాకు ఏం వస్తుంది?" అనే చిన్న ఆలోచనను 'Break' చేయండి. పర్పస్ ఎప్పుడూ మీకంటే పెద్దదై ఉండాలి. మీరు సమాజానికి లేదా మీ వృత్తికి ఏ Valueఇస్తున్నారో ఆలోచించండి.
Step 2: Build Ikigai
మీకు ఇష్టమైనది, మీరు చేయగలిగేది, ప్రపంచానికి అవసరమైనది—ఈ మూడూ కలిసే చోటే మీ పర్పస్ ఉంటుంది. దాన్ని ప్రతిరోజూ మీ పనుల్లో 'Build' చేయండి. మీ పర్సనాలిటీ మీ పర్పస్ కి ప్రతిరూపం కావాలి.
Step 3: Legacy Building
మీ పర్పస్ ని ఒక సిస్టమ్ గా మార్చండి. మీరు లేకపోయినా ఆ ఉద్దేశ్యం కొనసాగాలి. మీరు చనిపోయిన తర్వాత కూడా మీ పర్పస్ ద్వారా మనుషులు ప్రభావితం అవ్వడమే 'Beyond' స్టేజ్.
మీ 'ఎందుకు' (Why) ఏంటి?
ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:
1. రేపు పొద్దున్నే మీరు బెడ్ మీద నుండి ఎందుకు లేవాలి? దానికి డబ్బులు కాకుండా వేరే బలమైన కారణం ఉందా?
2. మీ జీవితంలో మీరు సాధించే విజయం వల్ల మీ కుటుంబం కాకుండా మరో పదిమందికి ఏమైనా లాభం ఉందా?
3. మీరు చేస్తున్న పనిలో మీకు 'సార్థకత' (Fulfillment) కనిపిస్తోందా?
పర్పస్ ఉంటే మీరు అజేయులు!
పర్పస్ లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది. అలలు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తుంది. కానీ ఒక పర్పస్ ఉంటే, మీరు సముద్రాన్నే శాసిస్తారు. మీ వ్యక్తిత్వం ఒక వెలుగు కిరణంలా మారుతుంది.
"The two most important days in your life are the day you are born and the day you find out why."
Mark Twain
సైకాలజిస్ట్ విశేష్
Genius Matrix Hub
8019 000066
www.psyvisesh.com
(చదవండి: మీ గరిష్ట సామర్థ్యాన్ని అందుకోవడం ఎలా?)
Tags : 1