పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..
Breaking News
లైంగిక వేధింపుల కేసు.. మలయాళ డైరెక్టర్‌కు షాక్..!
Published on Thu, 04/02/2026 - 16:12
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన మలయాళ డైరెక్టర్ రంజిత్ బాలకృష్ణన్‌కు కేరళ ఫిల్మ్ ఫెడరేషన్ షాకిచ్చింది. తక్షణమే ఆయనను ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA) నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి. ఉన్నికృష్ణన్ వెల్లడించారు. ఈ కేసులో అంతర్గత విచారణ పూర్తి చేసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. తమ సభ్యులపై లైంగిక ఆరోపణలు వచ్చిన కేసులలో ఫెడరేషన్ ఒక ప్రామాణిక విధానాన్ని అనుసరిస్తుందని ఉన్నికృష్ణన్ పేర్కొన్నారు.
కాగా.. కొచ్చిలోని ఒక సినిమా షూటింగ్ ప్రదేశంలో తనపై క్యారవాన్ లోపల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒక యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 30న షూటింగ్ సెట్‌లో తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆ నటి ఆరోపించింది. దీంతో ఆయనను కొచ్చి పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం నటి ఫిర్యాదు చేయగా.. ఎర్నాకులం మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రంజిత్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. అతను ప్రస్తుతం ఎర్నాకులం సబ్ జైలులో ఉన్నాడు.
Tags : 1