పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..
Breaking News
అమల్లోకి కొత్త ఐటీ చట్టం
Published on Thu, 04/02/2026 - 08:49
ఆదాయపన్ను చట్టం, 2025 బుధవారం నుంచి అమల్లోకి వచి్చంది. దేశ పన్ను చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయంగా నిలిచిపోతుందని.. వికసిత్ భారత్ దిశగా కీలక అడుగు అవుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) పేర్కొంది. ఆరు దశాబ్దాల కాలం నాటి ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో మరింత సరళతర చట్టంగా కేంద్రం దీన్ని రూపొందించడం తెలిసిందే. మరింత స్పష్టత, నిబంధనల అమలు సులభతరం, సరళమైన భాష, చదివే వారు అర్థం చేసుకునేందుకు అనుకూలత ఇందులోని ప్రత్యేకతలుగా సీబీడీటీ పేర్కొంది.
కొత్త చట్టానికి మారే క్రమంలో పాత, కొత్త పన్ను చట్టాల పరిధిలో నిబంధనల అమలుకు ఇ–ఫైలింగ్ పోర్టల్ వీలు కలి్పంచనుందని సీబీడీటీ తెలిపింది. ముందటి సంవత్సరాలకు సంబంధించి అన్ని మదింపులు, అప్పీళ్లు పాత పన్ను చట్టం కిందే కొనసాగుతాయని, అసెస్‌మెంట్ సంవత్సరం 2026–27 (2025–26 ఆర్థిక సంవత్సరం) రిటర్నులను పాత పన్ను చట్టం కింద దాఖలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు
Tags : 1