కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం
Breaking News
ఆ సినిమా నేను చేయట్లేదు.. షాకిచ్చిన మలయాళ హీరో
Published on Tue, 03/31/2026 - 18:40
తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఇందులో మలయాళ హీరో టొవినో థామస్.. విలన్‌గా నటిస్తున్నాడనే రూమర్స్ చాన్నాళ్ల క్రితమే వచ్చాయి. ఇప్పుడు టొవినో హీరోగా నటించిన 'పల్లి చట్టంబి' మూవీ తెలుగులోనూ విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్ వచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ తారక్-నీల్ సినిమాలో తాను నటించట్లేదని క్లారిటీ ఇచ్చేశాడు. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2')
'తెలుగ చిత్రాల్లో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ మలయాళ వర్కింగ్ కల్చర్‌తో పోలిస్తే టాలీవుడ్లో భిన్నంగా ఉంటుంది. మేం తక్కువ టైంలోనే షూటింగ్ పూర్తిచేసేస్తాం. తెలుగులో షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కువ. పైగా ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటించడం నాకు ఇష్టముండదు. ఒకటి పూర్తయ్యాకే మరొకటి చేస్తుంటా. ఒకవేళ తెలుగులో పెద్ద సినిమాలో నటిస్తే.. నేను ఒప్పుకొన్నా మూడు-నాలుగు మలయాళ చిత్రాలపై దాని ప్రభావం పడుతుంది. అందుకే తెలుగులో నటించలేకపోతున్నా. డేట్స్ సర్దుబాటు చేయలేక ఆ మూవీ(ఎన్టీఆర్-నీల్) చేయట్లేదు' అని టొవినో థామస్ చెప్పుకొచ్చాడు.
కెరీర్ ప్రారంభంలో సహాయ నటుడిగా చాలా సినిమాలు చేసిన టొవినో థామస్.. గత పదేళ్లుగా మాత్రం హీరోగా మూవీస్ చేస్తున్నాడు. మిన్నల్ మురళి, 2018 తదితర డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఇతడు పరిచితమే. అలాంటిది ఇప్పుడు ఇతడు, ఎన్టీఆర్-నీల్ మూవీలో లేడని తెలిసింది. మరి ఇతడి బదులు వేరే ఎవరిని తీసుకున్నారో చూడాలి?
(ఇదీ చదవండి: OTTలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా.. తెలుగులోనూ)
Tags : 1