'వెంటపడొద్దు.. ఎక్కువ సంపాదిస్తావు': బఫెట్ ఫార్ములా

Published on Mon, 03/30/2026 - 20:00

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ లాభాలు గడిస్తారని లేదా అందరూ నష్టపోతారని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే ఇన్వెస్టర్ ఎలా ఉండాలి? ఎలాంటి విధానాలు అనుసరించాలి? అనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. దీనికి ప్రపంచ దిగ్గజ మదుపరిగా ఎంతోమందికి సుపరిచితమైన 'బఫెట్' ఫార్ములా తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్ లాభాల్లో సాగుతున్నప్పుడు.. కొంతమంది మిస్ అవుతామేమో అనే ఆందోళనతో కొనుగోలు చేస్తుంటారు. నష్టం వస్తే అయ్యో అని బాధపడతారు. ఇలాంటి సమయంలో బఫెట్ చెప్పే మాట ఏమిటంటే.. 'ఎప్పుడూ వెంటపడొద్దు' ప్రతి అవకాశాన్ని వెంటాడాల్సిన అవసరం లేదు.

ఒక కంపెనీ ఎంత గొప్పదైనా సరే, దాని షేర్ ధర చాలా ఎక్కువగా ఉంటే వెంటనే కొనకూడదు. సరైన విలువ వచ్చినప్పుడు మాత్రమే కొనాలి. ఇది పెట్టుబడిదారులకు ఓపికను, నియంత్రణను నేర్పిస్తుంది. పెట్టుబడిదారుడు ఎప్పుడూ కూడా.. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి.

బఫెట్ తన తత్వాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ. బేస్‌బాల్ క్రీడాకారుడు.. బేస్‌బాల్‌లో మంచి ఫలితం పొందాలంటే సరైన బంతి కోసం ఎదురు చూడాలి. ప్రతి బంతిని కొట్టాల్సిన అవసరం లేదు. అదే విధంగా.. పెట్టుబడుల్లో కూడా ప్రతి స్టాక్‌ను కొనాల్సిన అవసరం లేదు.

బఫెట్ చెప్పినట్లుగా.. మార్కెట్‌లో ఎన్నో కంపెనీలు ఉంటాయి. కానీ మనకు అర్థమయ్యే, మంచి కంపెనీలు మాత్రమే ఎంచుకోవాలి. అవి సరైన ధరలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏదైనా ఒక అవకాశం వదిలేస్తే.. మిమ్మల్ని ఎవరూ శిక్షించరు. కాబట్టి ఆలోచించాలి.

ప్రతి స్టాక్ లేదా ప్రతి ట్రెండ్ గురించి అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి విషయాలను బాగా అర్థం చేసుకోవడం చాలు. అదే నిజమైన విజయం తీసుకువస్తుంది. మీకు జీవితంలో కేవలం 20 సార్లు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తే.. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. తప్పులు తక్కువ చేస్తారు, మంచి అవకాశాలను మాత్రమే ఎంచుకుంటారు, దీర్ఘకాలంలో ఎక్కువ సంపాదిస్తారు అని పేర్కొన్నారు.

Videos

క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు

బస్సు ప్రమాద బాధితులకు మేకపాటి సాయం

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు లేరు..

కుర్రాడు మంచోడే కానీ... ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ పెట్టాడు..!

అంతా ఫిబ్రవరి 26 తర్వాతే ఇప్పుడు దుబాయ్ ఎలా ఉందంటే?

దళిత ఉద్యోగిపై బూతులు.. పిఠాపురం కమీషనర్ ఆడియో లీక్

SIP లో నెలకు ఎంత పెట్టుబడి పెడితే 5 కోట్లు సంపాందించొచ్చు..!

పందిలా ఒళ్ళు బలిసి... దవడ పగిలిపోద్ది.. జనసేన సుభాషిణిని రఫ్ఫాడించిన నేత

ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు

భారీగా పడిపోయిన బంగారం ధరలు! కొనుగోలుదారులకు పండగ..

Photos

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)

+5

గ్రీన్‌ అవుట్‌ఫిట్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి, శాసన సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)