కిరోసిన్‌ దీపం వెలుగులో చదువుకుని ఐఏఎస్‌ అయ్యాడు..!

Published on Mon, 03/30/2026 - 12:49

మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా.. మన లక్ష్యం దృఢంగా ఉండాలి. ఎంతలా పరిస్థితులు కుంగదీస్తున్నా..మన ధ్యేయం గురితప్పకూడదు. కష్టమే కష్టపెట్టలేక విసిగిపోయేలా..గెలుపు తీరాలని అందుకుని స్ఫూర్తిగా నిలవాలి. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ అన్షుమాన్ రాజ్.

బిహార్‌కి చెందిన అన్షుమాన్‌ రాజ్‌ బాల్యం మొత్తం బక్సర్‌జిల్లా నవానగర్‌ బ్లాక్‌లో సాగింది. తండ్రి రైస్‌మిల్లు వ్యాపారం నష్టాల్లోకి వెళ్లడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయింది. దాంతో కనీసం ఇంట్లో విద్యుత్‌ సౌకర్యం లేక ఇక్కట్లు పడుతుండేది. అయితే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలైన అతడి తల్లి ఒక్కరే కుటుంబానికి ఆధారంగా మారింది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ  ఎంతో పట్టుదలతో చదువుకునేవాడు. 

నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను ప్రారంభించి అక్కడే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. మెట్రిక్యులేషన్ తర్వాత, అతను జవహర్‌లాల్ నవోదయ విద్యాలయంలో తన చదువును కొనసాగించి, 12వ తరగతిని పూర్తి చేశాడు. ఆ తర్వాత అదే సంస్థ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశాడు. అప్పుడే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధం కావాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాడు. అన్షుమాన్‌ తన అచంచలమైన పట్టుదలతో తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్‌ క్లియర్‌ చేయగలిగాడు గానీ మెయిన్స్‌లో సక్సెస్‌ కాలేకపోయాడు. 

ఆ ఎదురుదెబ్బకు నిరుత్సాహపడకుండా మరోసారి పయత్నించేందుకు ఢిల్లీకి మకాం మార్చాడు. రెండో ప్రయత్నంలో కూడా రాత పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణుడయ్యాడు కానీ పర్సనాలిటీ టెస్ట్‌లో పాస్‌ కాలేకపోయాడు. దాంతో ముచ్చటగా మూడోసారి పరీక్ష రాశారు.  ఆ ప్రయత్నంలో మొత్తం మూడు దశలనూ విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ ఐఏఎస్‌కు కాకుండా ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ పోస్ట్‌ పొందాడు. 

కానీ అన్షుమాన్‌ తన డ్రీమ్‌ని వదులుకోవడానికి ఇష్టపడక.. మరోసారి అకుంఠిత దీక్షతో సివిల్స్‌కు సన్నద్ధమై 2019 నాల్గో ప్రయంత్నంలో తన ఆకాంక్షను నెరవేర్చుకున్నాడు. 107 ఆల్‌ ఇండియా ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్‌ అధికారి అయ్యాడు. అతడి కథ..అకస్మాత్తుగా వచ్చిపడే కష్టాలకు లక్ష్యాన్ని త్యాగం చేయాల్సిన పనిలేదని తెలుపుతోంది. ఎన్ని కష్టాలు వెంటాడినా..వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తే..కచ్చితంగా ఏదో ఒకరోజు విజయం పాదాక్రాంతం అవుతుందని ఐఏఎస్‌ అన్షుమాన్‌ కథ చెప్పకనే చెబుతోంది కదూ..!. 

(చదవండి: నాడు కాలేజ్‌ డ్రాపౌట్‌..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో చోటు..!)
 

Videos

క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు

బస్సు ప్రమాద బాధితులకు మేకపాటి సాయం

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు లేరు..

కుర్రాడు మంచోడే కానీ... ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ పెట్టాడు..!

అంతా ఫిబ్రవరి 26 తర్వాతే ఇప్పుడు దుబాయ్ ఎలా ఉందంటే?

దళిత ఉద్యోగిపై బూతులు.. పిఠాపురం కమీషనర్ ఆడియో లీక్

SIP లో నెలకు ఎంత పెట్టుబడి పెడితే 5 కోట్లు సంపాందించొచ్చు..!

పందిలా ఒళ్ళు బలిసి... దవడ పగిలిపోద్ది.. జనసేన సుభాషిణిని రఫ్ఫాడించిన నేత

ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు

భారీగా పడిపోయిన బంగారం ధరలు! కొనుగోలుదారులకు పండగ..

Photos

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)

+5

గ్రీన్‌ అవుట్‌ఫిట్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి, శాసన సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)