భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..
Breaking News
మొన్న అనుష్క.. నిన్న సాయి పల్లవి.. ఇబ్బంది పెడుతున్న రూమర్స్!
Published on Sun, 03/29/2026 - 17:42
సినీ హీరోయిన్ల పర్సనల్ లైఫ్‌పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంటుంది. పలానా హీరోతో ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్లి అని.. ఇలా రకరకాల రూమర్స్ పుట్టుకొస్తుంటాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే నెటిజన్లు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేస్తుంటారు. నిజానిజాలతో సంబంధం లేకుండా, సోషల్ మీడియా వేదికగా సాగే ఈ గాసిప్స్ కొన్నిసార్లు హీరోయిన్లకు తలనొప్పిగా మారుతున్నాయి. సినిమాల వరకు పుకార్లు వస్తే పెద్దగా పట్టించుకోరు. కానీ పర్సనల్ లైఫ్..ముఖ్యంగా పెళ్లి గురించి కూడా అసత్యాలను ప్రచారం చేస్తే కొంతమంది తారలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, అనుష్కలు కూడా తమ పెళ్లిపై వచ్చిన గాసిప్స్‌ని కొట్టిపారేస్తూనే.. వదంతువులు పుట్టించినవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనుష్కపై ఆగని ట్రోలింగ్
నటి అనుష్క పెళ్లిపై వదంతులు వస్తూనే ఉన్నాయి. ఆమె కెరీర్లో బిజీగా ఉన్న సమయం నుంచే పెళ్లి పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే అనుష్క మాత్రం వాటిపై స్పందించలేదు. కానీ, ఈ మధ్య కొంతమంది అనుష్కకు ఏకంగా ఎంగేజ్మెంట్ అయిపోయిందన్నట్లుగా ప్రచారం చేశారు. గతంలో ఓ ప్యాషన్ షోలో ఓ వ్యక్తి చేతిని పట్టుకొని నడుస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చూస్తూ.. అనుష్క ఎంగేజ్మెంట్ అయింది..త్వరలోనే పెళ్లి అని ప్రచారం చేశారు. అయితే ఆ ఫోటోని కొంతమంది గుర్తించడంతో.. అది ఫేక్ అని తెలిసిపోయింది. అనుష్క కూడా స్పందించకపోవడంతో అది పుకారేనని క్లారిటీ వచ్చింది.
సాయి పల్లవికి పెళ్లి ఆలోచననే లేదు
ఇక సాయి పల్లవి పరిస్థితి కూడా అంతే. ఆమెకు తెలియకుండానే పెళ్లి చేసేస్తున్నారు. అల్రేడీ ప్రేమలో ఉందని..త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని నెట్టింట పోస్టులు పెట్టారు. దీనిపై సాయి పల్లవి స్పందించారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచననే లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రస్తుతానికి తాను సింగిల్ అని కూడా చెప్పింది. కెరీర్ పరంగా సాయి పల్లవి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. హిందీలో ఆమె నటించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా రామాయణం ఇతిహాసం ఇతివృత్తంతో రూపొందుతున్న రామాయణ 1,2 భాగాల్లో సీతగా నటిస్తున్నారు. దీంతో పాటు ధనుష్ సినిమాలోనూ ఆమె నటిస్తోంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో ఆమె పెళ్లిపై పుకార్లు రావడంతో వెంటనే క్లారిటీ ఇచ్చేసింది.
Tags : 1