భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..
Breaking News
‘ఇథనాల్’ ఇంధనమే ఆదుకుంటోంది..
Published on Sun, 03/29/2026 - 13:11
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో.. దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వ 'ఇథనాల్ మిశ్రమ విధానం' (Ethanol Blending Policy) భారత్‌కు రక్షణ కవచంలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. శనివారం జేవార్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, దేశ ఇంధన భద్రతలో రైతుల పాత్రను కొనియాడారు.
చమురు దిగుమతులకు అడ్డుకట్ట..
ముడి చమురు దిగుమతుల కోసం వెచ్చించే వేల కోట్ల రూపాయలను ఆదా చేయడంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన చెరకు రైతులు కీలక పాత్ర పోషించారని ప్రధాని తెలిపారు. "ఇథనాల్ మిశ్రమ విధానం లేకపోతే, మనం విదేశాల నుండి అదనంగా 4.5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. రైతులే మన దేశ విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడారు" అని ఆయన పేర్కొన్నారు.
భారత్‌కు అవసరమైన చమురులో దాదాపు 40% పశ్చిమాసియా నుండే అందుతోంది. ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల ధరలు పెరిగినప్పటికీ, ఇథనాల్ వాడకం వల్ల భారత్ ఆ ప్రభావాన్ని తట్టుకోగలుగుతోందని ప్రధాని వివరించారు.
వేగంగా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్
ఖరీదైన ముడి చమురు దిగుమతులను తగ్గించడం, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న భారత ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ మోదీ ప్రభుత్వ హయాంలో వేగం పుంజుకుంది. నిర్ణయించుకున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని, గడువు కంటే ఐదేళ్ల ముందే గత ఏడాది భారత్ సాధించింది.
ఈ క్రమంలో గత ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా E20 (20% ఇథనాల్ మిశ్రమం) సరఫరా అవుతోంది. దీంతో ఇదే ఉత్సాహంతో 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా భారతత్ గత 10 ఏళ్లలో సుమారు రూ.1.36 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతేడాది జూలైలో తెలిపింది.
Tags : 1