ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు
Breaking News
డెవర్లే... రైతులుగా...
Published on Sun, 03/29/2026 - 10:52
కేరళ కోజికోడ్‌లోని ఆటోడ్రైవర్లకు ఇంట్లో భోజనం చేసే అవకాశం లేకపోవడంతో రెస్టారెంట్లలో తినేవారు. ఖర్చు కళ్లు తిరిగేలా ఉండేది. ఇలా అయితే కుదరదనుకొని డ్రైవర్లందరూ కలిసి ఒక చోట సొంతంగా వంటలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ ప్రయోగం సూపర్ హిట్ అయింది.
డబ్బు ఆదాతోపాటు ఆరోగ్యం కూడా!
ఇప్పుడు ఈ డ్రైవర్లు సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులుగా మారి మరోసారి సంతోషాన్ని సొంతం చేసుకున్నారు. భూస్వామి కోలకట్టిల్ బీజు దగ్గర భూమి లీజు తీసుకొని రైతుగా తొలి అడుగు వేశారు. ‘డ్రైవింగ్ చేసినంత సులభం కాదు... వ్యవసాయం అంటే’.... ఇలాంటి వెక్కిరింపులు ఎన్నో వినిపించినా వారు వెనక్కి తగ్గలేదు.తమ జీవనోపాధిని పణంగా పెట్టి బీడు నేలలోకి పాదం మోపారు.తెల్లవారుజామున తొలి వెలుగుతోనే పొలం పనులకు శ్రీకారం చుట్టేవారు. ఆ తరువాత డ్రైవర్‌గా రోడ్డు మీదికి వెళతారు. మళ్లీ సాయంత్రం ఇష్టంగా పొలంలోకి వస్తారు. రోజంతా ట్రాఫిక్ పొగల మధ్య ఉండే వారికి పచ్చటి పొలాల మధ్య ఉండడం ఇష్టం.
ఒక్క ముక్కలో చెప్పాలంటే...డ్రైవర్‌గా ఉన్నప్పుడు తప్ప మిగిలిన సమయమంతా పొలంలోనే ఉంటారు. తమ రెక్కల కష్టంతో పాలకూర, పప్పుధాన్యాలు, బెండకాయ, గుమ్మడికాయ, దోసకాయ వంటి పలు రకాల పంటలతో పచ్చని కూరగాయల తోటను సృష్టించారు. పంట సాగు చేయడానికి అవసరమైన డబ్బులను తామే సమకూర్చుకున్నారు. అత్యున్నత శ్రేణి విత్తనాలు, సహజ ఎరువులతో పంట పండించారు.
అకాల వర్షాలు కురిసినప్పటికీ వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. చేనులో కోసిన కూరగాయలను ఇంటి అవసరాలకు ఉపయోగించడంతోపాటు, మార్కెట్ ధరకు వాటిని అమ్ముకున్నారు. ‘డ్రైవర్‌గా మాకు లైసెన్స్ ఉంది. ఇక రైతుగా మా లైసెన్స్... మేము పడే కష్టం’ అంటున్నాడు చంద్రశేఖరన్. ‘రోజంతా హారన్లు మోగించే మేము మొక్కలకు నీరు పోయడం పని కాదు. ప్రశాంతత’ అంటున్నాడు అబ్దుల్ రహీం.
‘జాతీయ రహదారిపై దొరకని విలువైన నిశ్శబ్దం ఇక్కడ దొరుకుతుంది’ అంటున్నాడు మహేష్ అనే రైతు. తాజా విషయానికి వస్తే... ఈ డ్రైవర్ రైతులు పెద్ద పంటలపై దృష్టి పెట్టారు. భవిష్యత్ కాలంలో వారు పూర్తిస్థాయి రైతులుగా మారినా ఆశ్చర్యం లేదు! ‘డ్రైవింగ్ చేసినంత సులభం కాదు... వ్యవసాయం అంటే’.... ఇలాంటి వెక్కిరింపులు ఎన్నో వినిపించినా వారు వెనక్కి తగ్గలేదు.
Tags : 1