Breaking News

మహాకాళిలో ప్రభాస్‌..!

Published on Sun, 03/29/2026 - 10:49

టాలీవుడ్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (పీవీసీయూ)లో భాగంగా తెరకెక్కుతున్న చిత్రం మహాకాళి.. ఇదే సినిమాటిక్‌లో వచ్చిన హనుమాన్‌ భారీ హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే.  ఫీమేల్‌ సూపర్‌ హీరో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు  ప్రశాంత్‌ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహాకాళిగా కన్నడ నటి భూమి శెట్టి నటింస్తుండగా.. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా (Akshaye Khanna) శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. అయితే, ప్రభాస్‌ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని ప్రచారం జరుగుతుంది.

మహాకాళి చిత్రంలో ప్రభాస్‌ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ.. ఆయన తన పాత్ర చిత్రీకరణను కూడా ఇప్పటికే పూర్తి చేశారని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఆయన పోషించబోయే పాత్ర  ఎలా ఉండనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నప్పలో కూడా ప్రభాస్‌ అతిథి పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే.

ఇప్పటివరకు మహాకాళి సినిమా 100 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అక్షయ్ ఖన్నా పాత్రకు సంబంధించి కూడా చిత్రీకరణ కూడా పూర్తయిందట. పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందించారు. ఇదే యూనివర్స్‌ (PVCU)లో భాగంగా  ‘అధీర’ను ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇందులో ఎస్‌జే సూర్య , కల్యాణ్ దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్‌ హీరో చిత్రాన్ని శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించనున్నారు.

Videos

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!

బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!

వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం

తడబడుతున్న చంద్రబాబు.. థిస్ ఇస్ వెరీ బ్యాడ్

భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?

సుబ్బారెడ్డి VS అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో కేబుల్ వార్

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)