రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!
Breaking News
2025లో స్వల్పంగా తగ్గిన నిరుద్యోగం
Published on Sun, 03/29/2026 - 04:51
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం గతేడాది (2025లో) 3.1 శాతానికి తగ్గింది. 2024లో ఇది 3.2 శాతంగా ఉంది. పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే, 2025 వివరాలను కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం..
⇒ 15 ఏళ్లకు వయసుపైబడిన మహిళల్లో నిరుద్యోగం 2024 మాదిరే 2025లోనూ 3.1% వద్దే ఉంది. పురుషుల్లో ఇది 3.3% నుంచి 3.1 శాతానికి తగ్గింది.
⇒ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 2024లో 2.4 శాతంగా ఉంది. అంతక్రితం ఏడాది ఇది 2.5%గా ఉంది. పల్లెల్లో పురుషుల నిరుద్యోగం 2.6 %గా ఉంటే, మహిళల్లో 2.1%గా నమోదైంది.
⇒ స్వయం ఉపాధి రేటు 2024లో ఉన్న 57.5 % నుంచి 2025లో 56.2 శాతానికి తగ్గింది.
⇒ సాధారణ లేబర్ పనుల్లో ఉపాధి 20.2%గా ఉంది.
⇒ వ్యవసాయ రంగంలో ఉపాధి 2025లో 43 శాతంగా నమోదైంది. 2024లో ఉన్న 44.8 శాతంతో పోల్చితే తగ్గింది.
⇒ నిర్మాణ రంగంలో ఉపాధి రేటు 12.3 శాతం నుంచి 12 శాతానికి తగ్గింది. ఇతర సేవల్లో ఇది 12.2 శాతం నుంచి 13.1 శాతానికి పెరిగింది.
⇒ కార్మికుల ఆర్జన మెరుగుపడింది. పురుషుల సగటు ఆర్జన 2024లో రూ.22,891గా ఉంటే, 2025లో రూ.24,217కు పెరిగింది. మహిళా కార్మికుల ఆర్జన రూ.17,126 నుంచి రూ.18,353కు వృద్ధి చెందింది.
Tags : 1