Breaking News

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పింది నేనే

Published on Sat, 03/28/2026 - 17:52

హీరోయిన్‌గా అప్పట్లో తెలుగు, తమిళ సినిమాలు చేసిన రాధిక.. ప్రస్తుతం టీవీ షోలు, అడపాదడపా మూవీస్ చేస్తూ బిజీగా ఉంటోంది. తెలుగులోనూ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్న ఈమె.. రీసెంట్‌గా అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా అనిపించాయి. బన్నీకి డ్యాన్స్ నేర్పింది నేనే అని అనేసరికి అతడి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఓ తెలుగు ఛానెల్‌లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షోలో రాధిక ఈ వ్యాఖ్యలు చేశారు.

(ఇదీ చదవండి: 'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్‌డేట్)

ఆట డ్యాన్స్ షోలో ప్రీతి అనే కంటెస్టెంట్.. 'పుష్ప 2'లోని జాతర పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ క్రమంలోనే సదరు కంటెస్టెంట్‌ని పొగిడిన జడ్జి రాధిక.. అల్లు అర్జున్ ఇంత గొప్ప డ్యాన్సర్ కావడానికి నేనే కారణం అని చమత్కరించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో గతంలో తాను ఓ సినిమా చేశానని, అప్పుడు షూటింగ్ సందర్భంగా బన్నీకి డ్యాన్స్ నేర్పించానని గుర్తుచేసుకుంది. అలానే సమయానికి చిన్న పిల్లాడు ఎవరూ లేకపోవడంతో బన్నీ తనతో పాటు ఓ సీన్‌లో కలిసి నటించాడని, ఇందులో భాగంగా అల్లు అర్జున్‌ని ఎత్తుకుని రైల్వే ట్రాక్‌పై పరుగెత్తిన విషయాన్ని రాధిక గుర్తుచేసుకుంది. ఈ విషయాలన్నీ రాధిక చెబుతున్న ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.

రాధిక ఈ కామెంట్స్ ఫన్నీగానే చేశారు. నెటిజన్లు కూడా అంతే సరదాగా రియాక్ట్ అవుతున్నారు. బన్నీకి మీరు డ్యాన్స్ నేర్పించారా అని మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ విషయానికొస్తే.. టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. పుష్ప, పుష్ప 2 చిత్రాలు ఇతడి స్థాయిని పెంచేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అట్లీ, లోకేశ్ కనగరాజ్‌లతో మూవీస్ చేస్తున్నాడు. వీటిపై బోలెడంత బజ్ ఉంది. 

(ఇదీ చదవండి: రెండు వారాలుగా బెడ్‌పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?)

Videos

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!

బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!

వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం

తడబడుతున్న చంద్రబాబు.. థిస్ ఇస్ వెరీ బ్యాడ్

భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?

సుబ్బారెడ్డి VS అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో కేబుల్ వార్

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)