Breaking News

శుభ్‌మన్ గిల్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌.. ధర తెలిస్తే షాకవుతారు!

Published on Sat, 03/28/2026 - 17:07

ఇప్పటికే చాలామంది సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు ముంబైలో ఆస్తులు, ఇల్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ టీమిండియా క్రికెటర్ 'శుభ్‌మన్ గిల్' కూడా చేరారు.

శుభ్‌మన్ గిల్.. ముంబై నగరంలోని జుహూ ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశారు. ఈ అపార్ట్‌మెంట్ విలువ సుమారు రూ.20.7 కోట్లు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం.. ఈ ఫ్లాట్‌ను పూజా లీజర్ అండ్ లైఫ్‌స్టైల్ అనే సంస్థ నుంచి కొనుగోలు చేశారు.

శుభ్‌మన్ గిల్ కొనుగోలు చేసిన ఈ అపార్ట్‌మెంట్.. ముంబైలోని జుహూ తారా రోడ్డుపై ఉన్న పూజా ల్యూమినేర్ అనే భవనంలో 12వ అంతస్తులో ఉంది. గిల్ ఈ 12వ అంతస్తు మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 3,369 చదరపు అడుగులు. ఈ లావాదేవీ కోసం రూ.1.24 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలు మార్చి 26, 2026న జరిగింది. మహారాష్ట్ర RERA వివరాల ప్రకారం.. ఈ భవనం ఇంకా నిర్మాణంలో ఉంది. 2029 ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉంది.

ముంబైలో ఇతర క్రికెటర్ల అపార్ట్‌మెంట్స్
ఇటీవల కాలంలో భారత క్రికెటర్లు ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం గమనించదగ్గ విషయం. ఇందులో సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ మొదలైనవారు ఉన్నారు.

👉సూర్యకుమార్ యాదవ్, అతని భార్య దేవిషా యాదవ్ ముంబైలోని డియోనార్ ప్రాంతంలో రూ.7.18 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.
👉రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ ప్రాభాదేవి ప్రాంతంలో రూ.26.30 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నారు.
👉జహీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సుమారు రూ.11 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.

Videos

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!

బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!

వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం

తడబడుతున్న చంద్రబాబు.. థిస్ ఇస్ వెరీ బ్యాడ్

భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?

సుబ్బారెడ్డి VS అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో కేబుల్ వార్

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)