Breaking News

వేసవి ఛాయిస్‌.. బస్సే బిగ్‌బాస్‌

Published on Sat, 03/28/2026 - 03:52

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమాన చార్జీలు పెరగడం, రైళ్ల రద్దీ తదితర అంశాల నేపథ్యంలో వేసవి సీజన్లో బస్సు ప్రయాణాలకు గణనీయంగా డిమాండ్‌ పెరగనున్నట్లు అభిబస్‌ సీవోవో రోహిత్‌ శర్మ చెప్పారు. ఇక పండుగలు, పెళ్లిళ్లు, తమిళనాడు .. పుదుచ్చేరి మొదలైన చోట్ల ఎన్నికలు జరగనుండటం కూడా ప్రయాణాలకి దోహదపడనున్నట్లు ఆయన చెప్పారు. క్రూడాయిల్‌ రేట్ల పెరుగుదలతో విమాన ప్రయాణాలు భారంగా మారడమనేది, పరోక్షంగా బస్సు ఆపరేటర్లకు ప్రయోజనం చేకూర్చనుందని పేర్కొన్నారు.

సాధారణంగా విమానాలు, రైళ్లు, వ్యక్తిగత వాహనాలతో బస్సుల సెగ్మెంట్‌ పోటీ పడాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, ఫ్లయిట్‌ చార్జీలు పెరిగినా, రైల్వే వెయిటింగ్‌ లిస్టులు పెరిగినా.. బస్సులకు మరింత డిమాండ్‌ ఏర్పడుతుందన్నారు. పీక్‌ సీజన్‌లో ప్రయాణికులను ఆకర్షించేందుకు 25 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు శర్మ వివరించారు. హైదరాబాద్‌–విజయవాడలాంటి కీలక రూట్లలో డిమాండ్‌ ఉంటోందని శర్మ చెప్పారు.

పింక్‌ సీట్‌ ఆప్షన్‌లాంటి భద్రతా ఫీచర్ల కారణంగా సోలోగా ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. హోలీ పండుగ వారానికి సంబంధించి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఏకంగా 70 శాతం పెరగ్గా, మహిళల ప్యాసింజర్ల సంఖ్య 80 శాతం పెరిగినట్లు శర్మ వివరించారు. 6.5 లక్షల రూట్లలో 6,200 ఆపరేటర్లకు అగ్రిగేటరుగా వ్యవహరిస్తున్న అభిబస్‌.. ఈ విభాగంలో రెండో స్థానంలో ఉంది.  

ఉబర్‌తో జట్టు..
ఇంటర్‌సిటీ బస్‌ టికెట్‌ బుకింగ్స్‌ సదుపాయాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చేలా ఉబర్‌తో కూడా చేతులు కలిపినట్లు శర్మ చెప్పారు. దీనితో ఉబర్‌ యాప్‌ నుంచే నేరుగా పలు ప్రాంతాలకు బస్‌ టికెట్లను బుక్‌ చేసుకునే వీలుందని ఆయన వివరించారు. ప్రస్తుతం 17 రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలతో కలిసి పని చేస్తున్నామన్నారు. టీఎస్‌ఆర్‌టీసీ, కేఎస్‌ఆర్‌టీసీ మొదలైనవి వీటిలో ఉన్నాయి.

ఇక అష్యూర్డ్‌ ప్రోగ్రాం కింద బస్సుల జాప్యం, రద్దు లాంటి సేవల నాణ్యత లోపాలకు 150% వరకు రీఫండ్‌ ఆఫర్‌ చేస్తున్నామని, ప్రస్తుతం ఈ ప్రోగ్రాంలో సుమారు 360 మంది ఆపరేటర్లు చేరారని శర్మ చెప్పారు. ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ ఇక్సిగోలో భాగమైన అభిబస్‌ ప్లాట్‌ఫాంపై 2026 ఆర్థిక సంవత్సరం క్యూ3లో స్థూల లావాదేవీల విలువ (జీటీవీ) 36% వృద్ధితో రూ. 670.9 కోట్లకు చేరగా, ఆదాయం 47% పెరిగి రూ. 75.5 కోట్లకు చేరింది. ప్రయాణికుల సంఖ్య 33% పెరిగి 67.3 లక్షలకు చేరింది. 

Videos

అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్

మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు

రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో రగడ..CI బాజీలాల్ పై మార్గాని భరత్ ఫైర్

గ్యాస్ కోసం ఆటోవాలాల కష్టాలు కిలోమీటర్ల మేర వాహనాలు

2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..

తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు

తృణమూల్ కాంగ్రెస్ పాలనపై పుస్తకాన్ని విడుదల చేసిన అమిత్ షా

రూపం మార్చుకొని మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్..

అమెరికా సంచలన ప్రకటన ఇరాన్ పని ఖతం!

అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు

Photos

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)