Breaking News

ఇన్ఫోసిస్‌ యూఎస్‌ షాపింగ్‌!

Published on Fri, 03/27/2026 - 06:11

న్యూఢిల్లీ: టెక్నాలజీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ భారీ కొనుగోళ్లకు తెరతీసింది. ఆరోగ్యపరిరక్షణ సంబంధ డిజిటల్‌ సమాచార కంపెనీ ఆప్టిమమ్‌ హెల్త్‌కేర్‌ ఐటీతోపాటు ఇన్సూరెన్స్‌ కన్సల్టింగ్‌ టెక్నాలజీ సంస్థ స్ట్రాటస్‌ను సొంతం చేసుకోనుంది. ఇందుకు ఉమ్మడిగా రూ. 5,260 కోట్లు వెచ్చించనుంది. ఆప్టిమమ్‌ హెల్త్‌కేర్‌ను ముందస్తు, ఆర్జన సంబంధ చెల్లింపులతోకలిపి 46.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనుంది. అయితే మేనేజ్‌మెంట్‌ ప్రోత్సాహకాలు, బోనస్‌లను మినహాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో కొనుగోలు పూర్తికాగలదని అంచనా. 

ఇందుకు ఫ్లోరిడా(యూఎస్‌) కంపెనీ ఆప్టిమమ్‌ హెల్త్‌కేర్‌ ఐటీతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. క్లాస్‌ హెల్త్‌కేర్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్, కన్సల్టింగ్‌ సేవల కంపెనీ ఆప్టిమమ్‌ భారీస్థాయి ట్రాన్స్‌ఫార్మేషన్‌లో క్లయింట్లకు సేవలు అందించడంలో గుర్తింపు పొందినట్లు పేర్కొంది. వెరసి కంపెనీ హెల్త్‌కేర్‌ వృద్ధి వ్యూహాలకు మద్దతు లభించనున్నట్లు తెలియజేసింది. తద్వారా కంపెనీ టోపజ్‌ ఏఐ, కోబాల్ట్‌ క్లౌడ్, క్లౌడ్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రా సర్వీసులను ఆప్టిమమ్‌ హెల్త్‌కేర్‌ ద్వారా ఆరోగ్యపరిరక్షణ సేవలందించే కంపెనీలు వినియోగించుకునేందుకు వీలుంటుందని ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ వివరించారు.  

స్ట్రాటస్‌ డీల్‌  
ప్రాపరీ్ట, క్యాజువాలిటీ(పీఅండ్‌సీ) ఇన్సూరెన్స్‌ పరిశ్రమలో టెక్నాలజీ సొల్యూషన్లు అందిస్తున్న యూఎస్‌ కంపెనీ స్ట్రాటస్‌ కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలియజేసింది. ఇందుకు ముందస్తు, ఆర్జన సంబంధ చెల్లింపులతోకలిపి 9.5 కోట్ల డాలర్ల నగదు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అయితే మేనేజ్‌మెంట్‌ ప్రోత్సాహకాలు, బోనస్‌లనుమినహాయించింది. దీంతో బీమా రంగంలో లీడర్‌షిప్‌ను మరింత పటిష్టపరచుకోనున్నట్లు తెలియజేసింది. గ్లోబల్‌ పీఅండ్‌సీ ఇన్సూరెన్స్‌ క్లయింట్లకు మరింత విస్తారంగా ఏఐ ఆధారిత డిజిటల్, డేటా ట్రాన్స్‌ఫార్మేషన్‌ సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది.

 పరిశ్రమ సంబంధ లోతైన పరిజ్ఞానం కలిగి 450 మంది నిపుణుల బృందాన్ని స్ట్రాటస్‌ కలిగి ఉన్నట్లు  పేర్కొంది. కన్సల్టింగ్‌ నైపుణ్యాలు, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సామర్థ్యాలు కలిగి ఉన్న టీమ్‌ను సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. భారత్‌సహా.. యూఎస్, కెనడాలలో గ్లోబల్‌ డెలివరీ కార్యకలాపాలు విస్తరించిన స్ట్రాటస్‌ ఎండ్‌టుఎండ్‌ గైడ్‌వైర్‌ ఇన్సూరెన్స్‌సూట్‌ సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు వివరించింది. వీటిలో పాలసీసెంటర్, క్లెయిమ్‌సెంటర్, బిల్లింగ్‌సెంటర్, అప్‌గ్రేడ్స్, అప్లికేషన్‌ మేనేజ్‌డ్‌ సర్వీసులు తదితరాలున్నట్లు పేర్కొంది.  

Videos

యువకుడు - వివాహిత ఏలూరు ఇంస్టాగ్రామ్ ప్రేమ కధ చివరికి ఏం జరిగిందంటే

విజయవాడ YSRCP ఆఫీస్ లో" శ్రీరామనవమి వేడుకలు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అమరావతి కాదు.. ATM ప్రతీ పైసా లెక్క చెప్పకపోతే.. బాబుపై MLC కల్పలతా రెడ్డి ఫైర్

ఛత్రపతి హిందీలో చేయకుండా ఉండాల్సింది

టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు

కరీంనగర్ RBL బ్యాంక్ లో భారీ కుంభకోణం

అమెరికా సంచలన నిర్ణయం కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకం

2 నెలల దాకా నో టెన్షన్.. దేశంలో 8 లక్షల టన్నుల LPG నిల్వలు

కడపలో ఆధిపత్య పోరు టీడీపీ ఇంఛార్జ్ ఆవుల వెంకటేష్ పై దాడి

Photos

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)

+5

భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)