కడప స్టీల్ పై బాబు నాటకం
Breaking News
'అప్పుడే నెల.. మీరు లేకుంటే నా పెళ్లి ఇలా జరిగేది కాదు'.. రష్మిక పోస్ట్
Published on Thu, 03/26/2026 - 21:15
విజయ్- రష్మిక పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఫిబ్రవరి 26న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‍లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి జరిగి నెల రోజులు పూర్తి కావడంతో ప్రత్యేక పోస్ట్ చేశారు. పెళ్లినాటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. విజయ్ దేవరకొండతో పాటు రష్మిక సైతం పెళ్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అప్పుడే నెల రోజులు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..' అప్పుడే ఒక నెల గడిచిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నా. పెళ్లి చేసుకోవడం అనేది ఎంతో దూరపు కలలా అనిపించేది.. కానీ ఇప్పుడు మా పెళ్లి జరిగి నెల రోజులు పూర్తయ్యాయి. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. అయితే పెళ్లి చేసుకోవాలని అనుకున్న క్షణం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రయాణంలో మహిళలే నాకు అండగా నిలిచి, నా రక్షకుల్లా వ్యవహరించారు. నేను మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా. ఇది శాశ్వతంగా నిలిచిపోయే ప్రేమ. మీరందరూ లేకుంటే ఈ పెళ్లి ఇంత అద్భుతంగా జరిగేది కాదు' తన వారిపై ప్రశంసలు కురిపించింది.
ఐశర్య, మాగంటి ప్రియ, అర్పిత పేర్లను రష్మిక ప్రస్తావించింది. వారి గురించి తన అనుభవాలను పంచుకుంది. ఇవి మీ రోజులు.. అన్నీ మర్చిపోండి, హాయిగా ఉండండి.. అంటూ చెప్పిన మీ అందరికీ నా ధన్యవాదాలు.. మేము కూడా అలానే చేశామని రష్మిక తెలిపింది. మీరందరూ లేకుండా ఈ పెళ్లి ఇంత అద్భుతంగా జరిగేది కాదని రాసుకొచ్చింది. నా జీవితంలో నన్ను ప్రశాంతంగా, నిలకడగా ఉండేలా చేసిన అందమైన మహిళలకు నా అభినందనలు.. ఇదే నా చిన్న ప్రపంచం అంటూ ఎమోషనలైంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tags : 1