Breaking News

గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!

Published on Thu, 03/26/2026 - 15:15

2026 ప్రారంభంలో భారీగా పెరిగిన వెండి, క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ ముందుకు సాగింది. మూడు నెలల కాలంలో ఏకంగా 44 శాతం తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇలాంటి సమయంలో వెండి కొనాలా?, ఇంకొంత కాలం వేచి చూడాలా? అని చాలామందికి అనుమానం కలిగింది. ఈ కథనంలో మీ అనుమానాలకు సమాధానం చూసేద్దాం.

జనవరి 2026లో రూ.4.20 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. నేటికి (మార్చి 26) రూ.2.60 లక్షల వద్దకు చేరింది. అంటే మూడు నెలలు ఇంకా గడవక ముందే సిల్వర్ రేటు రూ.1.60 లక్షలు తగ్గింది. సాధారణంగా.. ధరలు 20 శాతం కంటే తగ్గితే  లేదా నష్టపోతే దాన్ని బేర్ మార్కెట్ అంటారు. ఇప్పుడు వెండి పరిస్థితి ఇక్కడే ఉందని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు తగ్గడానికి కారణం?
సిల్వర్ ధరలు ఇంతలా తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డాలర్ విలువ బలపడటం అనే చెప్పాలి. ఇది కాకుండా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల సరఫరా అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉండవచ్చని అంచనాలు కూడా వెండి ధరలు తగ్గడానికి కారణమవుతున్నాయి.

నిపుణుల అభిప్రాయం
క్రమంగా తగ్గిన వెండి ధరలు మెల్లగా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న ధరలతో పోలిస్తే.. ఇప్పుడున్న ధరలు చాలా తక్కువ. కాబట్టి వెండి కొనుగోలు చేయడానికి ఇది మంచి తరుణం అని కొందరు చెబుతున్నారు. ధరలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇంకొంతకాలం వేచి ఉండటం మంచిదని మరికొందరు చెబుతున్నారు.

పెట్టుబడిదారులకు సూచనలు
బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం. అది ఆభరణాలుగా కొనుగోలు చేస్తారా?, బిస్కెట్స్, కడ్డీల రూపంలో కొనుగోలు చేస్తారా అనేది పూర్తిగా మీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి అనేది మీ సొంత నిర్ణయం. అవసరమైన నమ్మకమైన నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇదీ చదవండి: రూ.3 లక్షలకి ఆర్డర్‌ పెడితే.. వాషింగ్‌ పౌడర్‌ వచ్చింది!

Videos

కడప స్టీల్ పై బాబు నాటకం

సుప్రియ ఒంటిపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి... పేర్ని నాని ఫైర్

ఓటమిని ఒప్పుకోండి.. మాతో మీరు గెలవడం కల్లా..

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

Photos

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)