Breaking News

మెటా లేఆఫ్స్.. ఏఐ కోసం ఉద్యోగులపై వేటు?

Published on Thu, 03/26/2026 - 08:45

సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫారమ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన కీలక విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ది ఇన్ఫర్మేషన్’ నివేదిక ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రధానంగా రియాలిటీ ల్యాబ్స్, సోషల్ మీడియా బృందాలు, రిక్రూట్‌మెంట్ విభాగాలపై ప్రభావం చూపనున్నాయి.

ఖర్చుల నియంత్రణే లక్ష్యం?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు మెటా చేస్తున్న భారీ పెట్టుబడులే ఈ తొలగింపులకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను మెటా మొత్తం ఖర్చులు 162 బిలియన్ల డాలర్లు నుంచి 169 బిలియన్‌ డాలర్ల మధ్య ఉంటాయని అంచనా. అగ్రశ్రేణి ఏఐ నిపుణులను ఆకర్షించేందుకు, వారిని నిలుపుకునేందుకు కంపెనీ మిలియన్ల కొద్దీ డాలర్లను వేతనాల రూపంలో వెచ్చిస్తోంది. ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తోంది. దాంతో కేవలం టెక్నికల్ విభాగాలే కాకుండా సేల్స్ విభాగంలోని పరిమిత సంఖ్యలో ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం ఉండనుంది.

నిజానికి ఈ ఉద్యోగ కోతలు ఆకస్మికమైనవి కావు. ఈ నెల ప్రారంభంలోనే రాయిటర్స్ ఒక నివేదికలో మెటా తన మొత్తం శ్రామిక శక్తిలో 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించే ఆలోచనలో ఉందని పేర్కొంది. ఇప్పటికే సీనియర్ నాయకులకు ఈ మేరకు సమాచారం అందిందని, సిబ్బంది తగ్గింపునకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

ఇతర కంపెనీలు ఇలా..

అమెజాన్

అమెజాన్ తన కార్పొరేట్ విభాగంలో భారీ మార్పులు చేస్తోంది. 2026 ప్రారంభంలోనే సుమారు 16,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించింది. కంపెనీలో మధ్యస్థాయి మేనేజ్‌మెంట్ హైరార్కీలను తగ్గించి నిర్ణయాధికారాన్ని వేగవంతం చేయాలని సీఈఓ ఆండీ జస్సీ నిర్ణయించారు. దీనివల్ల బ్యూరోక్రసీ తగ్గి ఏఐ ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం సులభమవుతుందని వారి భావన.

మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ (అజూర్‌), ఏఐ విభాగాలకు పెద్దపీట వేస్తూనే ఇతర విభాగాల్లో కోతలు విధిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే పలు విడతల్లో వేలాది మందిని తొలగించింది. డేటా సెంటర్ల నిర్మాణం కోసం మైక్రోసాఫ్ట్ ఏటా దాదాపు 80 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ భారీ పెట్టుబడులను బ్యాలెన్స్ చేయడానికి మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తోంది.

గూగుల్

గూగుల్ తన అడ్వర్టైజింగ్ సేల్స్, హార్డ్‌వేర్ విభాగాల్లో మార్పులు చేస్తోంది. ఏఐ సహాయంతో పనులను ఆటోమేట్ చేయడం ద్వారా తక్కువ మందితో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఎఫిషియెన్సీ పేరుతో కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఉద్యోగులను తగ్గిస్తోంది.

ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? 

Videos

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

అమరావతిలో బాబు అవినీతి యజ్ఞం

4 గంటల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి..

దొరకాలి నా కొడుకు.. పెట్రోల్ పోసి తగలబెడతా

Photos

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)