కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!

Published on Wed, 03/25/2026 - 12:15

మన చుట్టూనే ఎందరో కష్టజీవులు ఉ‍న్నారు. తమ కష్టంతో తలరాతలనే మార్చుకుని అద్భుతాలు సృష్టిస్తున్నావారెందరో ఉన్నారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ యువకుడు. సోషల్‌ మీడియా ఎక్స్‌ పోస్ట్‌లో పాడ్‌కాస్టర్‌ కుశల్‌ షేర్‌ చేసిన ఆ యవకుడి కథ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు, స్ఫూర్తిదాయకమైన కథ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం విశేషం. చుట్టూ పరిమిత వనరులు..నిరంతర శ్రమతో కూడిన జీవితం నుంచి పైకొచ్చిన యువకడి స్టోరీ ఇది.!.

ఆ అబ్బాయే ముంబైకి చెందిన అభిషేక్‌ ఆర్‌ వైశ్య. టీనేజ్‌ వయసు నుంచే వృత్తి జీవితం మొదలైంది. సుమారు 13 నుంచి 20 సంవత్సరాల వయసులో అతను ముంబైలోని అత్యంత రద్దీప్రాంతమైన దాదర్‌లో కూరగాయలు అమ్ముతూ తండ్రికి చేదుడువాదోడుగా ఉండేవాడు. ప్రతిరోజు అతడి దినచర్య సూర్యోదయానికి ముందే ప్రారంభమయ్యేది. 

ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య కూరగాయల అమ్మకాలు చూసుకునేవాడు. ఆ తర్వాత ఏ మాత్రం విరామం లేకుండా సీఏ కోచింగ్‌ క్లాసులకు వెళ్లిపోయేవాడు. అలా ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు క్లాసులతో సరిపోయేది.  ఆ క్లాసులు ముగిశాక, అతను రోజంతా ఆర్టికల్‌ షిప్‌ శిక్షణకు కేటాయించుకునేవాడు. సీఏ కోర్సులో భాగంగా ప్రాక్టీకల్‌ అనుభవం కోసం చేసే సీనియర్‌ సీఏ వద్ద చేసే ట్రైనింగ్‌ ఈ ఆర్టికల్‌ షిప్‌. ఇక రాత్రి 11 గంటల టైంకి ఫ్రీ టైం దొరుకుతుంది. 

ఇక ఆ సమయంలో చదువుకోవడానికి సమయం కేటాయించుకునేవాడు. పైగా ఉండే గది కూడా కేవలం 150 చదరపు అడుగుల చిన్న గది. పరిమిత స్థలం, పరిమిత వనురులే అయినప్పటికీ..ఎదగాలన్న తాపత్రయం, కసి పుష్కలంగా ఉండేవి. అవి అతడిని..అంత కష్టాన్ని భరించే శక్తిని ఇచ్చేవి. అలా అతడు సీఏ ఉత్తీర్ణుడై..విదేశాలకు వెళ్లాడు. అలా ఒమన్‌కు వెళ్లి అక్కడ ఆరేళ్లు పనిచేసి, వృత్తిపరమైన అనుభవాన్ని పొందాడు. చివరికి  వ్యవస్థాపకరంగంలోకి అడుగుపెట్టి.. సొంత వ్యాపారాలతో సంపదను పెంచుకున్నాడు.  మంచి స్థాయిలోకి వచ్చాక చేసిన  మొదటి పని తండ్రిని ఆ కూరగాయలు అమ్మే పని నుంచి మానిపించేయడం. 

ఆ తర్వాత భారత్‌, దుబాయ్‌, ఒమన్‌ వంటి చోట్ల మొత్త ఐదు ఫ్లాట్‌లు కొనుగులు చేశాడు. పైగా బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌ వంటి విలాసవంతమైన కార్ల తోపాటు ఒమన్‌లో అతడికి అత్యంత ప్రజాదరణ పొందిన క్లౌడ్‌కిచెన్‌ వ్యాపారాన్ని కూడా రన్‌ చేస్తుండటం విశేషం. పట్టుదలతో చక్కగా కెరీర్‌ని తీర్చిదిద్దుకున్న అతడి కథను వివరిస్తూ..పాడ్‌కాస్టర్‌ కుశల్‌ ఇలా అన్నారు. అభిషేక్‌ను వ్యక్తిగతంగా కలవడం తనపై చెరగని ముద్ర వేసిందన్నారు. 

అతనిపై మరింత గౌరవం పెరిగిందని చెప్పారు. మనం కోరుకున్న లక్ష్యంవైపుకి వెళ్లడం కోసం ఎంతలా కష్టపడాలి, ఎంతటి పట్టుదల ఉండాలో తెలిసి వచ్చిందని కుశాల్‌లోధా అన్నారు. అతడితో సంభాషణ స్ఫూర్తిదాయకంగానే కాదు పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి ఆశయాన్ని అయినా పాదాక్రాంతం చేసుకోవచ్చనే నమ్మకాన్ని ఇచ్చిందన్నారు.

 

(చదవండి: ఐదుగురు పిల్లల తల్లి!.. ఏకంగా 67 కిలోల బరువు తగ్గి ఇలా..)

Videos

ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...

KCR మంచి దోస్త్ నాకు..

తొందర పడకు.. ప్రతి రోజు సినిమా చూపిస్తా..

BJP MLA రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..

పూరీలా ఒక్క రోజు బతికితే చాలు..

పరిస్థితుల్ని అదుపుచేయ్యాలి అంటే లాక్ డౌన్ తప్పదా..?

ఆ బిల్లుకు పూర్తి మద్దతు మోదీకి జగన్ ట్వీట్

కూటమి వేధింపులు.. IAS, IPSలను కూడా వదలరా!

యుద్ధం పేరుతో గ్యాస్ మాటలు... కిరోసిన్ ఇస్తావు సరే... స్టవ్ లు సంగతేంటి

ఇబ్బందులు ఉంటాయి తెలిసినా అశోక్ బాబు మాత్రం...

Photos

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

యువ నటుడు కెన్ కరుణాస్ 'యూత్' సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్రోల్‌ బంక్‌ల వద్ద భారీ క్యూ.. వదంతులతో జనం పరుగులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో జోరు వాన (ఫోటోలు)

+5

నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా (ఫోటోలు)