టొవినో థామస్ సినిమా.. రూ. 14 కోట్ల మోసం అంటూ..

Published on Wed, 03/25/2026 - 09:20

మలయాళ నటుడు టొవినో థామస్, కయాదు లోహర్‌ నటిస్తున్న కొత్త చిత్రం 'పల్లి చట్టంబి' వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు డీజో జోస్‌ ఆంటోనీ తెరకెక్కిస్తున్నారు. రెండురోజుల క్రితం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. సామాజిక మాధ్యమాలలో సినిమాపై బజ్‌ కూడా క్రియేట్‌ అయింది. ఇందులో విజయ్‌ రాఘవన్, సుధీర్, బాబురాజ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. నౌఫల్, బ్రిజేశ్, సీసీసీ బ్రదర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్‌ 10న   విడుదల కానుంది.

మాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం.. దుబాయ్‌లో నివసిస్తున్న ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈ చిత్ర నిర్మాతలైన నౌఫల్ అహ్మద్, బ్రిజేష్ మహమ్మద్‌లపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను సుమారు రూ. 14 కోట్లకు మోసం చేశారని, ఆ నిధులతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని ఆయన ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు పిటిషన్‌లో భాగంగా మాత్రమే ఉన్నాయి. కానీ కోర్టులో ఇంకా నిరూపించబడలేదు. హైకోర్టు ఈ విషయాన్ని విచారణకు స్వీకరించి, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఆదేశాలు కూడా షెడ్యూల్ చేసింది. అయితే, ఇప్పటివరకు, చిత్ర బృందం నుండి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. ఈ సినిమా 1950, 60ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో రూపొందుతోంది.

Videos

ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...

KCR మంచి దోస్త్ నాకు..

తొందర పడకు.. ప్రతి రోజు సినిమా చూపిస్తా..

BJP MLA రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..

పూరీలా ఒక్క రోజు బతికితే చాలు..

పరిస్థితుల్ని అదుపుచేయ్యాలి అంటే లాక్ డౌన్ తప్పదా..?

ఆ బిల్లుకు పూర్తి మద్దతు మోదీకి జగన్ ట్వీట్

కూటమి వేధింపులు.. IAS, IPSలను కూడా వదలరా!

యుద్ధం పేరుతో గ్యాస్ మాటలు... కిరోసిన్ ఇస్తావు సరే... స్టవ్ లు సంగతేంటి

ఇబ్బందులు ఉంటాయి తెలిసినా అశోక్ బాబు మాత్రం...

Photos

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

యువ నటుడు కెన్ కరుణాస్ 'యూత్' సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్రోల్‌ బంక్‌ల వద్ద భారీ క్యూ.. వదంతులతో జనం పరుగులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో జోరు వాన (ఫోటోలు)

+5

నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా (ఫోటోలు)