ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్
Breaking News
ఇక ఆరంభం.. తారుమారైన గోల్డ్ రేటు!
Published on Tue, 03/24/2026 - 18:44
వారం రోజులుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో పసిడి ధరల పరుగు మళ్లీ మొదలైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?, ఉదయం ధరలకు.. సాయంత్రం ధరలకు మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో.. ఈ రోజు (మార్చి 24) ఉదయం 1,40,350 రూపాయల వద్ద ఉన్న తులం బంగారం ధర.. సాయంత్రానికి 1,42,910 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర 1,28,650 రూపాయల నుంచి 1,31,000 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది.
ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. తులం 24 క్యారెట్ల రేటు రూ.1,40,500 నుంచి రూ.143060 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 128800 రూపాయల నుంచి రూ.131150 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు గంటల వ్యవధిలో ఎంతలా మారిందో స్[స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
చెన్నై విషయానికి వస్తే.. ఈ నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.970 తగ్గి.. 144560 రూపాయలు వద్ద, 22 క్యారెట్ల రేటు 900 రూపాయలు తగ్గి, రూ.132500 వద్దకు చేరింది. మొత్తం మీద పడిపోతున్నాయన్న బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.
వెండి ధరలు ఇలా
బంగారం బాటలోనే వెండి అన్నట్లు.. ఉదయం కేజీపైన రూ.10000 తగ్గి రూ.2.40 లక్షల వద్ద ఉన్న సిల్వర్.. సాయంత్రానికి రూ.2.50 లక్షలకు చేరుకుంది. అంటే వెండి కూడా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
Tags : 1