Breaking News

టెలికాం కంపెనీల న‌యా దోపిడీ.. రాఘవ్ చద్దా కీల‌క వ్యాఖ్య‌లు

Published on Tue, 03/24/2026 - 16:28

సాధారణంగా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే.. ప్లాన్‌ను బట్టి డేటా, టాక్‌టైమ్‌ వేరుగా ఉంటాయి. టాక్‌టైమ్‌ విషయం పక్కన పెడితే.. డేటా మాత్రం ఉపయోగించినా?, ఉపయోగించకపోయినా? రోజు పూర్తవగానే (అర్ధరాత్రి 12 తరువాత) డేటా ఎక్స్‌పైరీ అవుతుంది. ఆ తరువాత మరుసటి రోజు డేటా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు.

రాఘవ్ చద్దా రాజ్యసభలో మొబైల్ డేటా వినియోగంపై ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. తన అభిప్రాయం ప్రకారం.. టెలికాం కంపెనీలు వినియోగదారులకు న్యాయం చేయడం లేదని పేర్కొన్నారు. వినియోగదారులు తమ డబ్బుతో కొనుగోలు చేసిన డేటాను పూర్తిగా వినియోగించుకునే హక్కు కలిగి ఉండాలి వాదించారు.

భారతదేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అవసరం చాలా అవసరం. కాబట్టి మొబైల్ డేటా వినియోగం ప్రతి ఒక్కరికి ముఖ్యమే. అయితే, టెలికాం సంస్థలు అందిస్తున్న డేటా ప్లాన్లలో కొన్ని లోపాలు ఉన్నాయని రాఘవ్ చద్దా సూచించారు.

ప్రస్తుతం చాలా కంపెనీలు రోజువారీ డేటా పరిమితులతో (1.0 జీబీ, 1.5 జీబీ, 2 జీబీ వంటి) ప్లాన్లు అందిస్తున్నాయి. కానీ వినియోగదారు ఆ రోజు మొత్తం డేటాను ఉపయోగించకపోతే.. మిగిలిన డేటా రాత్రి 12 గంటలకు పూర్తిగా రద్దవుతుంది. అంటే.. వినియోగదారు తన డబ్బుతో కొనుగోలు చేసిన డేటాను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాడు. ఇది వినియోగదారుల పట్ల అన్యాయం అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇతర సేవలతో పోలిస్తే ఈ పరిస్థితి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఉదాహరణకు.. మనం ఒక లీటర్ పెట్రోల్ కొట్టించామంటే అది పూర్తయ్యే వరకు ఉపయోగిస్తాం. విద్యుత్ ఎంత వినియోగిస్తారో.. దానికి మాత్రమే డబ్బు చెల్లిస్తాము. కానీ కానీ మొబైల్ డేటా విషయంలో మాత్రం వినియోగించని డేటా కూడా కోల్పోతున్నాం. డబ్బు మాత్రం చెల్లించాలి. ఇది సరైన విధానం కాదని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.

పరిష్కార మార్గాలు
డేటా పూర్తిగా వినియోగించకపోతే.. మిగిలిన డేటాను కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. దీనికి మూడు పరిష్కార మార్గాలున్నాయని రాఘవ్ చద్దా వెల్లడించారు.

డేటా రోల్‌ఓవర్: ఒక రోజు వినియోగించని డేటా తరువాతి రోజు ఉపయోగించడానికి అవకాశం ఇవ్వాలి. ఇది వినియోగదారులకు న్యాయం చేస్తుంది.
డిస్కౌంట్ లేదా సర్దుబాటు: వినియోగదారులు తరచుగా తక్కువ డేటా వినియోగిస్తే, వారికి వచ్చే నెల రీచార్జ్‌లో తగ్గింపు ఇవ్వాలి.
డేటా బదిలీ: వినియోగించని డేటాను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు పంపే అవకాశం కల్పించాలి. డేటాను వినియోగదారుల డిజిటల్ ఆస్తిగా పరిగణించాలి.

ఇదీ చదవండి: 26 ఏళ్ల వయసులో కోట్ల డబ్బు: ఖర్చు చేసిన స్టైల్.. నెట్టింట వైరల్!

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)