Breaking News

విషాదం.. ‘సూపర్‌మ్యాన్' నటి కన్నుమూత

Published on Tue, 03/24/2026 - 13:31

హాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి, ‘సూపర్‌మ్యాన్' ఫేం  వాలెరీ పెర్రిన్ (82) కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో బెవర్లీ హిల్స్‌ సమీపంలో ఉన్న తన ఇంట్లో పెర్రిన్ మరణించినట్లు ఆమె స్నేహితుడు, ఆత్మీయ సహచరి అయిన స్టేసీ సౌథర్ ప్రకటించారు.  

2015లో ఆమెకు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది, దీని కారణంగా గతకొంతకాలంగా ఆమె మంచానికే పరిమితం అయింది. మాట్లాడే సామర్థ్యాన్ని కూడా కోల్పోయింది. అయినా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఇన్నాళ్లు జీవిందని సౌథర్ అన్నారు. ఫారెస్ట్ లాన్ స్మశానవాటికలో ఖననం చేయాలన్నది పెర్రిన్ చివరి కోరిక అని చెబుతూ, సౌథర్ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నటనలోకి అడుగుపెట్టిన పెర్రిన్, తన గ్లామర్‌,నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. 1978లో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా  'సూపర్‌మ్యాన్'లో విలన్ లెక్స్ లూథర్ ప్రియురాలిగా, 'మిస్ టెష్‌మాకర్' పాత్రలో వాలెరీ పెర్రిన్ అద్భుత నటనను కనబరిచారు. ఈ పాత్ర ఆమెకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టింది.  

'సూపర్‌మ్యాన్ II'తో పాటు, 'లెన్నీ' (Lenny) అనే చిత్రంలో ఆమె నటనకు గానూ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డు లభించింది. అంతేకాకుండా ఆమె ఆస్కార్ రేసులో కూడా నిలిచారు. పెర్రిన్ మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)