పక్షవాతానికి వార్నింగ్‌ బెల్‌..!

Published on Sun, 03/22/2026 - 14:34

పక్షవాతం అనే సమస్య అకస్మాత్తుగా వైకల్యం తెచ్చిపెట్టి మరొకరిపై ఆధారపడేలా చేస్తుంది. ఒకసారి పక్షవాతానికి గురైతే చాలాకాలం మరొకరిపై ఆధారపడాల్సి రావచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో జీవితాంతం ఆ బాధ తప్పకపోచ్చు. అయితే అంతటి తీవ్రమైన పక్షవాతం కూడా తాను వచ్చే ముందర కొన్ని వార్నింగ్‌ సిగ్నల్స్‌ పంపుతుంది. వాటిని తెలుసుకుని ముందే జాగ్రత్త పడితే ఆ ముప్పు తప్పుతుంది. ‘ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ ఎటాక్‌’ (టీఐఏ) అనేవే ఆ వార్నింగ్‌ సిగ్నల్స్‌. ప్రమాద ఘంటికలను మోగించే ఆ హెచ్చరిక ఏమిటో చూద్దాం...

ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ ఎటాక్‌  (సంక్షిప్తంగా ‘టీఐఏ’)ను పక్షవాతానికి (బ్రెయిన్‌ స్ట్రోక్‌కు) ముందస్తు సూచనగా పరిగణించవచ్చు. పక్షవాతంలో ఉండే లక్షణాలే ‘టీఐఏ’లోనూ కనిపిస్తయి. కాకపోతే అవి తాత్కాలికంగా కనిపించి తగ్గిపోతాయి.  కానీ పక్షవాతంలో అలా కాదు. ఆ లక్షణాలు అలాగే ఉండిపోతాయి. 

ఈ నేపథ్యంలో ‘టీఐఏ’ను ఓ ముందస్తు హెచ్చరికలా పరిగణించి, జాగ్రత్తపడితే భవిష్యత్తులో వచ్చే వైకల్యపు ముప్పు చాలావరకు నివారించవచ్చు.  అయితే టీఐఏ ఒకసారి కనిపించిందంటే అది మళ్లీ వచ్చేందుకు (రికరెన్స్‌కు) అవకాశం ఎక్కువ. అందుకే దాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఎందుకు వచ్చిందో తెలుసుకుని, పక్షవాతానికి వాడే మందుల్ని జీవితాంతం వాడాలి. పక్షవాతమే వచ్చినంత జాగ్రత్తగా ఉండాలి. 

టీఐఏ లక్షణాలు: 
ముఖంలోని ఓ పక్కభాగంలో అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం 

ఒకవైపు చేయి లేదా కాలూ బలహీనపడటం లేదా తాత్కాలికంగా పడిపోవడం 

మాట ముద్దముద్దగా రావడం లేదా మాట పడిపోవడం 

నిలకడగా నిలవలేకపోవడం (బ్యాలెన్స్‌ తప్పడం) 

అకస్మాత్తుగా ఒకటి లేదా రెండు కళ్లు కనిపించకపోవడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం. 

ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ అటాక్‌లో ఈ లక్షణాలన్నీ సాధారణంగా కాసేపే ఉండవచ్చు. ఇవన్నీ గంటలోపే తగ్గిపోతాయి. అయితే పక్షవాతం వచ్చినప్పుడు అవే లక్షణాలు చాలాకాలం పాటు లేదా జీవితాంతం ఉండిపోతాయి. 

అందుకే టీఐఏ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకుని, డాక్టర్‌ను సంప్రదించి వారు సూచించిన మందులు, సలహాలు పాటించాలి. అంతేకాకుండా... తగిన జీవనశైలి మార్పులతో (లైఫ్‌స్టైల్‌ మాడిఫికేషన్స్‌తో) భవిష్యత్తులో రాబోయే పక్షవాతాన్ని నివారించుకోవచ్చు.  

ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ అటాక్‌కు కారణాలు... 
1) మెదడుకు రక్తాన్ని సప్లై చేసే రక్తనాళాలు లేదా మెదడులోని రక్తనాళాలు సన్నబడటం. 2) గుండెలో లేదా మెదడుకు సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, అవి రక్తప్రవాహంలో కొట్టుకు΄ోయి మెదడులోని రక్తసరఫరాకు అడ్డుపడటం. 

టీఐయే / పక్షవాతం ముప్పు ఎవరెవరిలో... 

రక్తంలో కొవ్వులు ఎక్కువగా ఉన్నవారిలో 

అధిక రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్‌ ఉన్నవారిలో 

పొగతాగడం, మద్యపానం అలవాటు ఉన్నవారిలో 

నిద్రలో గురకపెట్టే వారిలో (స్లీప్‌ ఆప్నియా), 

నిర్ధారణ: టీఐఏ లక్షణాల ఆధారంగా దాన్ని నిర్ధారణ చేయడం తేలికే. సాధారణంగా ఎమ్మారై బ్రెయిన్, కెరోటిడ్‌ డాప్లర్‌ ఈసీజీ, 2డీ ఎకో, బ్లడ్‌ కోయాగ్యులేషన్‌ పారామీటర్స్‌ వంటి పరీక్షలతో టీఐఏని నిర్ధారణ చేస్తారు.  

చికిత్స: రక్తాన్ని పలుచబార్చే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, అసిట్రోమ్, స్టాటిన్స్‌ వంటి మందులను సూచిస్తారు. రక్తనాళాలు సన్నబారడం 70 శాతం కంటే ఎక్కువగా జరిగితే స్టెంటింగ్‌ లేదా ఎండరాక్టమీ వంటి ప్రక్రియలు చేయాల్సిరావచ్చు.
డా. రంజిత్‌, సీనియర్‌ న్యూరాలజిస్ట్‌  

(చదవండి: 'మత్తు'కు మందు ఇలా..!)

Videos

అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు

హెచ్-1బీ వీసా కష్టాలు.. కరిగిపోతున్న అమెరికా కలలు

ఖతార్ లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

రాసలీలలు చేసిన వ్యక్తితో దేవునికి పట్టు వస్త్రాలా?

వెనుక ఉండి నక్కి నక్కి చూస్తున్నాడు.. ఇప్పుడు అర్థమైందా నీ స్థాయి BR నాయుడు..

పెట్రోల్ రేటు పెంపు? చమురు కొరతపై మోదీ రివ్యూ మీటింగ్..

రెచ్చిపోయిన సీఎం రమేష్.. బంజారా హిల్స్ లో భూకబ్జాకు యత్నం

అమెరికా మాపై దాడి చేస్తే మేము భారత్ పై దాడి చేస్తాం: పాక్ మాజీ హై కమీషనర్

సిద్ధమైన న్యూక్లియర్ సబ్ మెరైన్ ఏక్షణమైనా దాడి చేసే ఛాన్స్..

యూట్యూబర్ వైష్ణవి భర్తకు తీవ్ర అస్వస్థత

Photos

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)

+5

మోడర్న్‌ లెహంగాలో ముద్దమందారంలా మిల్కీబ్యూటీ.. (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 22-29)

+5

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)

+5

సంగీత సంబరం.. ట్రాఫిక్‌ సంకటం (ఫోటోలు)

+5

Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)