అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు
Breaking News
ఇంటిపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ..!
Published on Sun, 03/22/2026 - 11:58
అమెరికా అనగానే గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. యూఎస్‌లో అత్యంత సుపరిచితమైన చిహ్నాలలో ఒకటి ఈ స్మారక చిహ్నం. దీన్ని స్వేచ్ఛ, ఆశకు ప్రతీకగా చెబుతుంటారు. అయితే భారత్‌లోని ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటిపైనే దీన్ని నిర్మించి వార్తల్లో నిలిచాడు. అంతేగాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ ఇల్లు ఓ ఆకర్షణగా మారింది. ఎందుకిలా అంటే..
పంజాబ్‌లోని ఎన్నారై గుర్జీత్ సింగ్ మథారు జలంధర్‌లోని కిషన్ పురా ప్రాంతంలో తన ఇంటి నాల్గో అంతస్థుపై ఈ ప్రసిద్ధ స్మారక చిహ్నం ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఈ ఇల్లు అందరి దృష్టిని ఆకర్షించేలా హైల్‌గా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దీన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తుంటారట కూడా.
రీజన్ ఏంటంటే..
గుర్జీత్ సింగ్ న్యూయార్క్‌లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తరచుగా చూడటం, ప్రతి ఏడాది భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆ నగరం జ్ఞాపకంగా ఏదైనా చేయాలన్న ఆలోచన నుంచి వచ్చిందే ఇది అని అన్నారు. 26 ఏళ్లుగా న్యూయార్క్‌లోనే నివశిస్తున్న గుర్జీత్ సింగ్‌కి ప్రతి ఏడాది భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ నగర జ్ఞాపకం ఉండేలా ఇలా ఆ స్మారక చిహ్నం ప్రతిరూపాన్ని ఇంటిపై ఏర్పాటు చేసుకున్నారు.
దాంతో ఈ నిర్మాణం స్థానిక ఆకర్షణగా మారింది. ఇది ఒకరకంగా విదేశీ జీవితానికి, స్వదేశంలోని తన మూలాలకు ఒక వ్యక్తిగత వారధిని నిర్మించినట్లు కనిపిస్తోంది ఆ కట్టడం. నెటిజన్లు కూడా పంజాబ్‌లోని ఓ చిన్న సైజ్ న్యూయార్క్ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
VIDEO | Punjab: Gurjeet Singh Matharu, an NRI living in New York for 26 years, has installed a Statue of Liberty replica on the fourth floor of his home in Jalandhar’s Kishanpura area, drawing visitors from nearby and far away.
He said the idea came from seeing the Statue of… pic.twitter.com/7PkZaTzJFO— Press Trust of India (@PTI_News) March 21, 2026
(చదవండి: పైలట్ ఎప్పటికీ మర్చిపోలేని ఫ్లైట్ జర్నీలు ఏంటో తెలుసా ..!)
Tags : 1