అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు
Breaking News
'ధురంధర్' విజయం వెనుక తెలుగు హిట్ సినిమా: ఆదిత్య ధర్
Published on Sun, 03/22/2026 - 11:15
రణ్‌వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధురంధర్- 2: ది రివెంజ్’.. బాక్సాఫీస్ వద్ద మూడురోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరిపోయింది. గతేడాదిలో విడుదలైన పార్ట్-1 భారీ విజయం అందుకోవడంతో దర్శకుడు ఆదిత్య ధర్ పేరు పాన్ ఇండియా రేంజ్‌లో ట్రెండ్ అవుతుంది. అయితే, ఇంతటి బ్లాక్ బస్టర్ సీక్వెల్స్‌ను డైరెక్ట్ చేసిన ఆదిత్య ధర్ తాజాగా తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపించారు. 'ధురంధర్' సినిమా విజయం వెనుక తెలుగు హిట్ సినిమా స్పూర్తి అని ఆయన పంచుకున్నారు.
నాగార్జున ఐకానిక్ చిత్రం 'శివ'(1989)పై దర్శకుడు ఆదిత్య ధర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని నేటికీ తప్పక చూడాలని ఆయన అన్నారు. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు శివ సినిమా చూసినట్లు గుర్తుచేసుకున్నారు. శివ చిత్రం చాలామంది దర్శకులకు దిక్సూచిగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సినిమా ద్వారా టెక్నికల్ వాల్యూస్, మేకింగ్ స్టైల్‌లో కొత్త ఒరవడిని RGV సృష్టించారని ఆయన మెచ్చుకున్నారు.
శివ సినిమాలోని ఇళయరాజా సంగీతంపై కూడా ఆదిత్య ధర్ ప్రశంసించారు. ఇందులో విప్లవాత్మకమైన సౌండ్ డిజైన్ ఉన్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. 'శివ' చిత్రం ఇప్పటికీ తాజాగా, శక్తివంతంగా అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ చిత్రం భారతీయ సినిమా భాషను ఎలా మార్చిందో, తరతరాల చిత్రనిర్మాతలకు ఎలా స్ఫూర్తినిచ్చిందో ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఒక ఆధునిక దర్శకుడి నుండి వచ్చిన ఈ అరుదైన ప్రశంస, నిజమైన క్లాసిక్‌లు కాలంతో పాటు మసకబారవని నిరూపిస్తుంది. రామ్‌గోపాల్ వర్మ తన సృజనాత్మక మేకింగ్‌తో తరతరాల దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారని, ఆదిత్య ధర్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి.
A 6 year old kid saw #Shiva and today he became #AdityaDhar https://t.co/Y0Fh3GP55Z pic.twitter.com/ARbIY4t2j0
— Nag Mama Rocks (@SravanPk4) March 21, 2026
Tags : 1