Breaking News

ఐశ్వర్యరాయ్‌కు సారీ చెప్పిన హీరోయిన్‌, ఎందుకంటే?

Published on Sat, 03/21/2026 - 15:57

పిల్లి కళ్ల హీరోయిన్‌ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు ఐశ్వర్యరాయ్‌.. ఆ తర్వాత కాస్త అటూఇటుగా ఐష్‌లాగే కనిపించే స్నేహా ఉల్లాల్‌ గుర్తొస్తుంది. తను కూడా హీరోయిన్‌ అయినప్పటికీ తనను ఐశ్వర్యతో పోల్చినందుకు తెగ సంబరపడిపోయింది. అదే సమయంలో ఒకసారి ఆమెను నేరుగా కలిసి క్షమాపణలు కూడా చెప్పింది.. అదెందుకో ఓసారి చూసేద్దాం..

సినిమా
'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది స్నేహా ఉల్లాల్‌. అప్పటికే 'లక్కీ: నో టైం ఫర్‌ లవ్‌' (2005) చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అలా ఓపక్క హిందీ సినిమాలు చేస్తూ మరోపక్క తెలుగు చిత్రాల్లో నటించింది. మధ్యలో కొంతకాలం సినిమాలకు గ్యాప్‌ ఇవ్వగా ఆ తర్వాత అడపడాదడపా సినిమాల్లో కనిపిస్తోంది.

సల్మాన్‌ ఎలాంటివాడంటే?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహ తన కెరీర్‌ తొలినాళ్ల గురించి ఓపెన్‌ అయింది. ఆమె మాట్లాడుతూ.. లక్కీ మూవీతో నా సినీరంగ ప్రవేశం జరిగింది. చిత్రీకరణ సమయంలో హీరో సల్మాన్‌ ఖాన్‌ నాకెంతో సపోర్ట్‌ చేశాడు. ఎప్పుడూ ఓపిక, సహనంతో మెదిలేవాడు. తానో పెద్ద హీరో అని ఎన్నడూ యాటిట్యూడ్‌ చూపించలేదు.

అలా ఫేమస్‌
నిజానికి నేను సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఐశ్వర్యరాయ్‌ మిస్‌ వరల్డ్‌ కిరీటం అందుకుంది. చూడటానికి నేను ఐశ్వర్యరాయ్‌లాగే ఉంటానని చాలామంది అంటుంటారు. అలా ఆమె మిస్‌ వరల్డ్‌ కిరీటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకుంటే నా చుట్టూ ఉన్న చిన్నప్రపంచంలో నేను సెలబ్రిటీ అయిపోయాను.

ఐశ్వర్యకు సారీ
నేను ఒకే ఒక్కసారి ఐశ్వర్యను కలిశాను. నన్ను చూడగానే ఆమె 'వెల్‌కమ్‌ టు ద ఫ్యామిలీ.. బాలీవుడ్‌కు స్వాగతం' అని సాదరంగా ఆహ్వానించింది. అప్పుడు వెంటనే నేను ఆమెకు సారీ చెప్పాను. మీడియాలో పదేపదే నన్ను ఐష్‌తో పోలుస్తూనే ఉన్నారు. దాని గురించే చెప్తూ నన్ను క్షమించండి, దయచేసి నన్ను ద్వేషించకండి అన్నాను. మరి ఆమె దాన్ని ఎలా తీసుకుందో నాకు తెలీదు అని స్నేహా ఉల్లాల్‌ పేర్కొంది.

చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న పునర్నవి

Videos

పెద్ది విడుదల మళ్ళీ వాయిదా? వార్తల్లో నిజమెంత?

యువతకు ముష్టి వేస్తున్నారా? జాబ్ క్యాలెండర్ పై జడ శ్రవణ్ రియాక్షన్

హాట్ టాపిక్ కు అడ్డాగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ Vs పోప్

ఏపీలో ఈదురుగాలులతో భారీ వర్షాలు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వలస కూలీలకు గుడ్ న్యూస్ కమర్షియల్ గ్యాస్ పై కేంద్రం కీలక నిర్ణయం

ఆ పేరు ఎత్తలంటేనే సిగ్గుగా ఉంది BR నాయుడుపై శ్యామల ఫైర్

పేర్ని కిట్టు ప్లెక్సీలపై కూటమి నేతల కడుపు మంట

మా భారతమ్మ పై పడి ఏడుస్తారు కదా ఉగాది వేడుకల్లో మరి మీ భార్యలు ఎక్కడ..?

పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారుల అవస్థలు

దాడులను ఖండిస్తూ ఇరాన్ ప్రధానికి మోదీ ఫోన్

Photos

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)