ఆపరేషన్ ముగించే సమయం ఆసన్నమైంది.. ట్రంప్ సంచలన ప్రకటన
పన్ను ఎగవేతలకు టెక్నాలజీతో చెక్
Published on Sat, 03/21/2026 - 04:23
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు విరోధులుకాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సక్రమ పన్ను చెల్లింపుదారులకు నిబంధనలు భారంకాకుండా ఆదాయపన్ను శాఖ అధికారులు వ్యవహరించవలసి ఉన్నదని సలహా ఇచ్చారు. అయితే టెక్నాలజీ వినియోగం ద్వారా ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని సూచించారు. 2025 ఆదాయపన్ను శాఖ చట్టంపై జాతీయస్థాయి అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన 2026 ప్రారంభ్ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రసంగించారు. ఏప్రిల్ 1 నుంచి అమలుకానున్న కొత్త చట్టం ద్వారా భారత్ స్నేహపూర్వక పన్ను దేశంగా అవతరించనున్నట్లు పేర్కొన్నారు.
#
Tags : 1