Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ కుదుపు..

Published on Thu, 03/19/2026 - 19:58

దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్యాంక్ పార్ట్ టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం ఇన్వెస్టర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిణామంతో గురువారం స్టాక్ మార్కెట్‌లో బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 1 లక్ష కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.

అసలేం జరిగింది?
మార్చి 17న పంపిన తన రాజీనామా లేఖలో చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పద్ధతులు, నిర్ణయాలు తన వ్యక్తిగత విలువలకు, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

"నేను బ్యాంకులో ఏదో తప్పు జరిగిందని ఆరోపించడం లేదు. కానీ నా వ్యక్తిగత భావజాలం, సంస్థ అనుసరిస్తున్న పద్ధతులు ఒకేలా లేవు. అందుకే తప్పుకుంటున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.

ఆర్థిక శాఖ మాజీ బ్యూరోక్రాట్ అయిన చక్రవర్తి, 2021లో బోర్డులో చేరారు. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో విలీనం వంటి కీలక ప్రక్రియలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.

మార్కెట్‌లో ప్రకంపనలు
చక్రవర్తి నిష్క్రమణ వార్త బయటకు రాగానే మార్కెట్ తీవ్రంగా స్పందించింది. ప్రారంభ ట్రేడింగ్‌లోనే షేరు ధర 9 శాతం మేర పడిపోయి రూ.770 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ల పతనం కారణంగా బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ-50 వందల పాయింట్ల మేర నష్టపోయింది. అయితే, మార్కెట్ ముగిసే సమయానికి షేరు స్వల్పంగా కోలుకుని, క్రితం ముగింపుతో పోలిస్తే 3.8 శాతం నష్టంతో రూ.810.80 వద్ద స్థిరపడింది.

రంగంలోకి దిగిన ఆర్‌బీఐ
పరిస్థితిని చక్కదిద్దేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తక్షణమే రంగంలోకి దిగింది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ వెటరన్ కేకీ మిస్త్రీని మార్చి 19 నుండి మూడు నెలల కాలానికి తాత్కాలిక పార్ట్ టైమ్ ఛైర్మన్‌గా నియమించేందుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది.

బ్యాంకులో ఎలాంటి ఆధిపత్య పోరాటాలు, కార్యాచరణ లోపాలు లేవని కేకీ మిస్త్రీ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన బ్యాంక్ అని, దాని వద్ద తగినంత మూలధనం, నగదు లభ్యత ఉన్నాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. మేనేజ్‌మెంట్ తీరుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్‌ ఎందుకంతలా కూలింది? ఇవే కారణాలు

Videos

కాంగ్రెస్ సర్కార్ రోజుకో స్కాం అసెంబ్లీలో మొత్తం బయటపెడతా

మాతో పెట్టుకోవద్దు.. పాక్‌కు ఆఫ్ఘన్ ప్లేయర్ వార్నింగ్

అసెంబ్లీలో బడ్జెట్ పై భట్టి స్పీచ్

బడ్జెట్ అంతా డొల్లే కాంగ్రెస్ పై BRS ఎమ్మెల్యేల ఫైర్

చీకు చింత లేని సంసారంలో చిచ్చు.. CI బయటపెట్టిన సంచలన విషయాలు

తినేది పెరుగన్నం నిమ్మకాయ బద్ద ఆస్తులు మాత్రం 20 లక్షల కోట్లు.. శ్రవణ్ షాకింగ్ నిజాలు

Telangana Budget: రూ. 3.24 లక్షల కోట్ల బడ్జెట్ ఏ శాఖకు ఎంతంటే..!

అడ్డుకున్న పోలీసులు ఇచ్చిపడేసిన కాకాణి

వాహనదారులకు షాక్! FASTag వార్షిక పాస్ట్ ధర పెంపు కొత్త రేట్లు ఇవే

అమెరికా ఫైటర్ జెట్ ధ్వంసం.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్

Photos

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)

+5

పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు (ఫొటోలు)

+5

విజయవాడ : సెలవులు, పండుగ వచ్చేసింది.. బస్టాండ్‌లో విద్యార్థులు, ప్రయాణికుల రద్దీ (ఫొటోలు)