Breaking News

ఈ సర్జరీలతో గుండెకు బైపాస్‌..!

Published on Tue, 03/17/2026 - 13:36

గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో కొవ్వు ఉండల వల్ల గానీ లేదా రక్తం గడ్డకట్టడంతో ఏర్పడిన క్లాట్స్‌ వల్లగానీ  వల్ల రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడి... గుండెకు అవసరమైన రక్తం అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య తలెత్తాక... రక్తనాళాలు ఇంకా పూర్తిగా మూసుకుపోనప్పుడు స్టెంట్‌ వేయడమన్నది చాలామందికి తెలిసిన విషయమే. స్టెంట్‌ వేశాక రక్తాన్ని పలచబార్చే మందులు కూడా ఇస్తుంటారు. అయితే మరికొన్ని సందర్భాల్లో గుండెకు రకరకాల శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఈ క్రమంలో బైపాస్‌ సర్జరీ, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ... అనే రకరకాల శస్త్రచికిత్సల పేర్లు  వినిపిస్తుంటాయి. ఈ సర్జరీలు ఏమిటి, రకరకాల శస్త్రచికిత్సల తాలూకు ప్రయోజనాలేమిటి లాంటి అనేక విషయాలను తెలుసుకుందాం.

గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు... నిజానికి శస్త్రచికిత్స కంటే ముందుగా స్టెంట్‌ ద్వారా ఆ అడ్డంకిని తొలగించడానికి గుండె  డాక్టర్లు ప్రయత్నిస్తారు. ముందుగా ఆ స్టెంట్‌ అంటే ఏమిటో చూద్దాం.

స్టెంట్‌ అంటే ఏమిటి...? 
గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి రక్తనాళాల్లోకి వెళ్లాక అక్కడ మూసుకు΄ోయిన రక్తనాళాన్ని వెడల్పు చేసే ఉపకరణాన్ని స్టెంట్‌ అంటారు. ఇందులోనూ రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక బెలూన్‌ వంటి ఉపకరనాన్ని పంపి, రక్తనాళం మూసుకుపోయిన చోట దాన్ని ఉబ్బేలా చేయడం ద్వారా అక్కడ ఏర్పడిన అడ్డంకిని తొలగించడాన్ని బెలూన్‌ యాంజియోప్లాస్టీ లేదా బెలూన్‌ స్టెంట్‌ అమర్చడంగా చెబుతారు.

నిజానికి ఇలా స్టెంట్‌ వేయడమన్నది పూర్తి స్థాయి శస్త్రచికిత్స కాదు. మొదట్లో తొడ భాగం లోని రక్తనాళాల నుంచి గుండెలోని రక్తనాళాల వరకు వెళ్లి అక్కడ మూసుకు΄ోయిన చోట స్టెంట్‌ వేసేవారు. అయితే ఇటీవల మణికట్టు నుంచే స్టెంట్‌ను పంపడమూ జరుగుతోంది.  

గుండెకు ఏరకమైన చికిత్స అవసరమనే విషయాన్ని తెలుసుకోడానికి...  తొలుత యాంజియోగ్రామ్‌ అనే పరీక్ష చేయించి, అటు తర్వాత గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో ఏదైనా సమస్య కనిపిస్తే...  బైపాస్‌ చేయించాలా లేదా మందులతోనే సమస్యను పరిష్కరించవచ్చా లేదంటే  స్టెంట్‌ వేయించాలా అని చాలా మంది అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది.  నిజానికి ఈ ఏయే సందర్భాల్లో చేస్తారో, అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

గుండెకు చేసే రకరకాల శస్త్రచికిత్సలేమిటి... వాటితో ప్రయోజనాలేమిటంటే...  
గుండెకు చేసే శస్త్రచికిత్సలు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది బైపాస్‌ సర్జరీ. రెండోవి వాల్వ్‌ సర్జరీలు. వీటిల్లో... బైపాస్‌ సర్జరీలోనే... ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ... దాంతోపాటు పలు సందర్భాల్లో నిర్వహించే రకరకాల సర్జరీలైన బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ, మినిమల్లీ ఇన్వేజివ్‌ కార్డియాక్‌ సర్జరీ, టోటల్‌ ఆర్టీరియల్‌ రీవాస్క్యులైజేషన్, ఎండోస్కోప్‌క్‌ సర్జరీ, హైబ్రిడ్‌ సర్జరీ, రొబోటిక్‌ బైపాస్‌ సర్జరీ వంటి వాటినీ అనుసరిస్తుంటారు. వాటి గురించి వరసగా...

బైపాస్‌ శస్త్రచికిత్స అంటే : ముందుగా బైపాస్‌ శస్త్రచికిత్స అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే... వాటిని వెడల్పు చేయకుండా అలాగే వదిలేసి... వాటికి ప్రత్యామ్నాయంగా వేరే రక్తనాళాలను ఉపయోగించి, ఈ కొత్తమార్గం ద్వారా గుండెకు యథాతథంగా  రక్తప్రసరణ జరిగేలా చేయడమే బైపాస్‌ శస్త్రచికిత్స. 

అంటే... ఇందులో అడ్డంకి ఉన్న రక్తనాళానికి పక్కగా... కరొనరీ ఆర్టరీ (బృహద్ధమని)   నుంచి నేరుగా గుండెకండరానికి రక్తం అందేలా మరో రక్తనాళాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో కరొనరీ ఆర్టరీ నుంచి గుండె కండరానికి రక్తం అందేలా చేయడానికి అవసరమైన అదనపు రక్తనాళాన్ని కాలి నుంచి తీసుకున్న రక్తనాళాన్నిగాని లేదా రొమ్ము ఎముక పక్కనే ఉన్న మ్యామరీ ధమనిని గాని ఉపయోగిస్తారు. ఇలా చేసే క్రమంలో ఒకవేళ సిరను ఉపయోగిస్తే దాన్ని వీనస్‌ గ్రాఫ్ట్‌ అని, ధమనిని ఉపయోగిస్తే ఆర్టీరియల్‌ గ్రాఫ్ట్‌ అంటారు.

బైపాస్‌ ఎవరికి అవసరం, దాంతో ఒనగూరే ప్రయోజనాలేమిటంటే... 
గుండెకు రక్తసరఫరా చేసే ప్రధాన రక్తనాళమైన లెఫ్ట్‌ మెయిన్‌లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెలో ఎడమపక్క ఉండే ముఖ్య రక్తనాళంలోని మొదటిభాగంలోనే అడ్డంకి ఉన్నప్పుడు గుండె తాలూకు పంపింగ్‌ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు ∙గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళంలో అనేకచోట్ల అడ్డంకులు ఏర్పడినప్పుడు ∙డయాబెటిస్‌ (మధుమేహ వ్యాధి) ఉన్న వారికి.  

ఓపెన్‌హార్ట్‌ సర్జరీ అంటే...? 
బైపాస్‌ శస్త్రచికిత్స సమయంలో రొమ్ముఎముకను చీల్చి సర్జన్‌ గుండె వరకు వెళ్తాడు. అయితే గండె అనుక్షణం కొట్టుకుంటూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇలా గుండె నిత్యం స్పందిస్తూ ఉండగా ఆపరేషన్‌ చేయడం ఒకింత కష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే తాత్కాలికంగా  గుండెను ఆపేసి (అచేతన స్థితిలో ఉంచి) ఈ ఆపరేషన్‌ నిర్వహిస్తారు. అలా గుండె అచేతన స్థితిలో ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన రక్తప్రసరణ యథాతథంగా  కొనసాగేందుకు హార్ట్‌లంగ్‌ మెషిన్‌ అనే పరికరాన్ని వాడతారు. ఏ శస్త్రచికిత్సలోనైతే ఈ హార్ట్‌లంగ్‌ మెషిన్‌ను వాడతారో... దాన్ని ‘ఓపెన్‌హార్ట్‌ సర్జరీ’ పరిగణించవచ్చు.

బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ అంటే...? 
దీన్ని ‘ఆఫ్‌ పంప్‌ సర్జరీ’ అని కూడా అంటారు. ఇందులో కూడా రొమ్ము ఎముకను చీలుస్తారు. అయితే ఈ ప్రక్రియలో గుండె స్పందనలను ఆపడం, మళ్లీ ్ర΄ారంభించడం గానీ జరగదు. ఓ పక్క గుండె స్పందనలు యథావిధిగా కొనసాగుతుండగానే బై΄ాస్‌ సర్జరీ నిర్వహిస్తారు. ఆక్టోపస్‌ అనే ఒక ప్రత్యేక  పరికరం ద్వారా గుండెలో ఆపరేషన్‌ జరుగుతున్న భాగం వరకు కదలకుండా చేసి, ఈ శస్త్రచికిత్స చేస్తారు. సాధారణ బై΄ాస్‌ శస్త్రచికిత్స తర్వాత కొంతమందిలో పక్షవాతం, మతిమరపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ వల్ల అలాంటి ఆ దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు బాగా తగ్గి΄ోతాయి.

మినిమల్లీ ఇన్వేజివ్‌ కార్డియాక్‌ సర్జరీ అంటే..? 
గత కొద్దికాలంగా గుండె శస్త్రచికిత్సలో అత్యంత ఆధునికమైన, చాలా అధునాతమైన వినూత్న వైద్య పురోగతి జరుగుతోంది. కేవలం చాలా చిన్న గాటు సహాయంతోనే బై΄ాస్‌ సర్జరీ నిర్వహించడం కూడా వీటిల్లో ఒకటి. ఇందులో ఎదుర్రొమ్ము ఎముకను చీల్చాల్సిన అవసరమే ఉండదు. అయితే పెద్ద శస్త్రచికిత్సల్లోలాగే మత్తు మందు ఇవ్వాల్సి ఉంటుంది. 

చర్మంపైన చాలా చిన్నవైన గాట్లు పెడుతూ వెంటనే తగ్గి΄ోయి మూసుకు΄ోయే రంధ్రాలు చేయడం ద్వారా ఈ లాపరోస్కోపిక్‌ ఆపరేషన్‌ చేస్తారు. గాటు, గాయం చాలా చిన్నవిగా ఉండటం వల్ల రోగులు చాలా త్వరగా కోలుకుంటారు. రక్తస్రావం, నొప్పి కూడా చాలా తక్కువే. శస్త్రచికిత్స తర్వాత ఆయాసం వంటి సమస్యలూ ఉత్పన్నం కావు. కానీ సర్జన్‌కు కేవలం గుండెలోని కొద్దిభాగం మాత్రమే కనిపిస్తుంటుంది కాబట్టి ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడానికి అతడికి చాలా నైపుణ్యం కావాలి. పైగా పేషెంట్లదరికీ ఈ చికిత్స చేయడం సాధ్యం కాకపోవచ్చు.

టీసీఆర్‌ఏటీ : ఈ ‘టీసీఆర్‌ఏటీ’ అనేది ‘టోటల్‌ కొరనరీ రీవాస్క్యులరైజేషన్‌ బై యాంటీరియర్‌ కొరకాటమీ’ అనే సర్జరీ ప్రక్రియ తాలూకు సంక్షిప్త రూపం. దీన్ని ఎదుర్రొమ్ముకు ఏమాత్రం కోత లేకుండా చేస్తారు. ఈ శస్త్రచికిత్సలో చిన్న గాటుతోనే (మినిమల్లీ ఇన్వేజివ్‌గానే) గుండె తాలూకు కీలకమైన ధమని అయిన  ‘కొరనరీ ఆర్టరీకి సంబంధించిన అనేక రక్తనాళాలకు బై΄ాస్‌ దారులు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. 

దాంతో గుండె కండరాలకు రక్తం ఎలాంటి అంతరాయం లేకుండా అందుతుంది. కేవలం 6 నుంచి 10 సెంటీమీటర్ల చిన్నపాటి గాటుతోనే గుండెకు బైపాస్‌ (కార్డియోపల్మునరీ బైపాస్‌ –సీపీబీ) శస్త్రచికిత్స నిర్వహిస్తారు. మిగతా బైపాస్‌ ప్రక్రియలతో పోలిస్తే ఇదెంతో సురక్షితమైనదీ, నొప్పి చాలా చాలా తక్కువ. ఇందులో పేషెంట్‌ కోలుకోవడం చాలా వేగంగా జరుగుతుంది.

కంప్లీట్‌ ఆర్టీరియల్‌ రీవాస్క్యులరైజేషన్‌ అంటే..? 
బైపాస్‌ శస్త్రచికిత్స చేసేప్పుడు జబ్బుపడ్డ ప్రతి ముఖ్యమైన రక్తనాళానికీ బైపాస్‌ గ్రాఫ్ట్‌ చేస్తారు. అంటే ఎన్ని రక్తనాళాల్లో అడ్డంకులు ఉంటే అన్ని చోట్లా బైపాస్‌ చేయడం కోసం అన్ని ప్రత్యామ్నాయ రక్తనాళాలను అతికిస్తారు... అంటే గ్రాఫ్ట్‌ చేస్తారని అర్థం.  చాలామందిలో ఒక్కోసారి మూడు లేక నాలుగు గ్రాఫ్ట్‌లు కూడా వేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి బై΄ాస్‌ సర్జరీలోనూ కనీసం ఒక ధమనిని ఉపయోగించడం పరి΄ాటి అయ్యింది. సాధారణంగా రొమ్ము ఎముకకు రక్తసరఫరా చేసే రొమ్ముఎముక ధమని (ఇంటర్నల్‌ మ్యామరీ ఆర్టరీ)ని ఉపయోగించి ఎల్‌ఏడీ కరొనరీ ధమని అనే దానికి అనుసంధానం (గ్రాఫ్ట్‌) చేస్తారు. 

కాలి నుంచి తీసిన సిరలతో పోలిస్తే ఇలా రొమ్ముఎముక నుంచి తీసిన ధమని చాలా కాలం పాటు మన్నికతో ఉంటుంది. అయితే టోటల్‌ ఆర్టీరియల్‌ రీవాస్క్యులరైజేషన్‌లో కాలినుంచి సిరలను తీయకుండా మణికట్టులోని ధమనులను, ఎడమ, కుడి రొమ్ము ఎముక ధమనులను ఉపయోగించి సర్జరీ చేస్తారు.

ఎండోస్కోపిక్‌ సర్జరీ అంటే...? 
ప్రస్తుతం చేస్తున్న సరికొత్త శస్త్రచికిత్సల్లో మణికట్టు నుంచి తీసే ధమని గానీ...  లేదా కాలి నుంచి తీసే సిరల విషయంలోగానీ...  పూర్తిగా గాటు పెట్టి తీయకుండా, చిన్న రంధ్రం మాత్రమే చేసి వాటిని సేకరిస్తారు. ఇలా  చేయడం వల్ల చేసే గాయం చాలా చిన్నది కావడం వల్ల పేషెంట్‌ చాలా త్వరితంగా  కోలుకోవడం సాధ్యమవుతుంది.

హైబ్రీడ్‌ సర్జరీ అంటే...? 
కొన్నిసార్లు బై΄ాస్‌ శస్త్రచికిత్సలో పేషెంట్‌ చాలా సీరియస్‌గానూ అతడి పరిస్థితి అత్యంత సంక్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని రక్తనాళాలకు యాంజియో΄్లాస్టీ ద్వారా, మరికొన్నింటికి బై΄ాస్‌ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించడం వల్ల చాలా రిస్క్‌లు తగ్గుతాయి. ఇలా చేయడం ద్వారా పేషెంట్‌ను చాలా త్వరగా కోలుకునేలా చేయవచ్చు. ఇలా ఒకే సర్జరీలో పలు రకాల శస్త్రచికిత్స ప్రక్రియలను చేయడాన్ని ‘హైబ్రీడ్‌ బై΄ాస్‌ సర్జరీ’ అంటారు.

రొబోటిక్‌ బైపాస్‌ సర్జరీ అంటే...?
ఈ ప్రక్రియలో డాక్టర్లు తమ బై΄ాస్‌ శస్త్రచికిత్సను రోబో సహాయంతో చేస్తుంటారు. ఈ ప్రక్రియలో మొదట మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీ లేదా ఎండోస్కోపిక్‌ సర్జరీలో చాలా చిన్న రంధ్రం మాత్రమే చేసి, దాని ద్వారా మిగతా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.  అంత చిన్న రంధ్రం నుంచి డాక్టర్‌ వేళ్లు రోగి శరీరంలోకి ప్రవేశింపజేయడం కష్టం. అందుకే రోబో తాలూకు సన్నని వేళ్లని ఆ రంధ్రంలోకి ప్రవేశింపజేసి, డాక్టర్లు (శస్త్రచికిత్సకులు) లోపలి దృశ్యాన్ని తెరమీద చూస్తూ... రోబో వేళ్లను బయటి నుంచే యంత్రాల సహాయంతో నియంత్రిస్తూ శస్త్రచికిత్స పూర్తి చేస్తారు.

బైపాస్‌ సర్జరీ తర్వాత... 
బైపాస్‌ శస్త్రచికిత్స తర్వాత పేషెంట్‌ కోలుకోడానికి 2–3 నెలలు పడుతుంది. మొదట్లో కొద్దిగా నీరసంగా ఉండటం చాలా సాధారణంగా జరిగే పరిణామమే. రొమ్ముఎముక చీల్చడం వల్ల ఛాతీకండరాల్లో, మెడ ఎముకల్లో, వెన్నుపూసల్లో, జబ్బల్లో నొప్పులు ఉండటాన్ని డాక్టర్లు సాధారణంగా చూస్తుంటారు. 

అదే సమయంలో కాలు లేదా చేతి నుంచి రక్తనాళం బయటకు తీస్తారు కాబట్టి అక్కడ కూడా కొంత నొప్పి, వాపు ఉండవచ్చు. కొందరు ఈ ఆపరేషన్‌ తర్వాత మనోనిబ్బరం కోల్పోతారు. మరికొందరికి జ్ఞాపకశక్తి, దృష్టికేంద్రీకరణ శక్తి కొద్దిగా తగ్గవచ్చు. కానీ ఆర్నెల్లో పేషెంట్‌ తన పూర్వస్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది.

త్వరగా కోలుకోవడం కోసం... 
పేషెంట్లు తమ జీవనోపాధి కోసం చేసే పనులు అంతగా బరువైనవి కాక΄ోతే రెండు నెలల తర్వాతి నుంచే తమ వృత్తులకు హాజరుకావచ్చు. అయితే కాస్తంత బరువు పనులు చేసేవారు కనీసం మూడు నెలలు ఆగడం మంచిది.  ఇక ఈ ఆపరేషన్‌ తర్వాత రెండునెలల పాటు వాహనం నడపడం అంత మంచిది కాదు. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్‌ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...

పొగతాగడం పూర్తిగా మానేయడం. ∙మంచి పుష్టికరమైన పోషకాహారం తీసుకుంటూ, దేహానికి శ్రమ కలగని విధంగా తగినంత వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం. ∙బరువును అదుపులో ఉంచుకోవడం. ∙మనోనిబ్బరంతో వ్యవహరించడం.

చివరగా... పైన సూచించిన జాగ్రత్తలను పాటిస్తూ, వైద్యులు చేసే సూచనలను  తప్పక అనుసరించడం ద్వారా గుండె శస్త్రచికిత్స తర్వాత కూడా సాధారణ జీవితాన్ని గడపడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే.
నిర్వహణ: యాసీన్‌

డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌

డాక్టర్‌ టి. వంశీధర్‌, సీనియర్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్‌ 

(చదవండి: పైల్స్‌ నుంచి ఫ్రీ అవ్వండి ఇలా..!)

Videos

103 డాలర్లకు చమురు ధర

దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు

కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన

సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు

శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్

Sec-Bad: 800 కిలోల కుళ్లిన చికెన్

ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

జగన్ 2.0 ట్రేడ్ మార్క్ మొదటి ప్రాధాన్యత వాళ్లకే

Photos

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)