Breaking News

సినీ నటీనటులు వెబ్‌సిరీస్‌ల్లో నటించకూడదు

Published on Tue, 03/17/2026 - 11:18

 తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా తమిళ సినీ నిర్మాతల మండలి  ఇటీవల చైన్నెలో సమావేశమైంది. తమిళ సినీ యాక్టివ్‌ నిర్మాతల మండలి అధ్యక్షుడు టీజీ త్యాగరాజన్‌, తమిళనాడు సినీ థియేటర్ల సంఘం అధ్యక్షుడు తిరుపూర్‌ సుబ్రహ్మణ్యం, తమిళనాడు సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు ఆరుళ్పతి ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలను ఆమోదించారు. 

ముఖ్యంగా ‘‘ నటీనటులు గానీ, దర్శకులు, ఇతర ప్రముఖ సాంకేతిక నిపుణులు ఓ నిర్మాత నుంచి అడ్వాన్స్‌ పొంది ఉంటే ముందుగా ఆయన చిత్రాన్ని పూర్తి చేయడానికే ప్రాధాన్యత నివ్వాలి. సినిమాల్లో నటించే నటీనటులు, దర్శకులు, సాంకేతిక వర్గం వెబ్‌ సిరీస్‌లో నటించడం గానీ, దర్శకత్వం వహించడం గానీ చేయరాదని తీర్మానించారు. అలా కాని పక్షంలో వారికి సినిమాల్లో పనిచేయడానికి సహకరించబోమని స్పష్టం చేశారు. 

ప్రముఖ నటులు రెవెన్యూ షేర్‌ విధానంలో చిత్రాల్లో నటించడానికి సహకరించాలి. చిత్రాలు విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని ఈ విధానాన్ని తమిళనాడులో మాత్రమే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లోనూ అమలు పరిచేలా ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు. 

ఈ తీర్మానాన్ని అమలు పరచడానికి డిస్టిబూటర్లు, థియేటర్లతో కలిపి ఓ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిటీ తీసుకునే నిర్ణయాలకు చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని సంఘాలు కట్టుబడి ఉండాలని తీర్మానం చేసినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిర్వాహకులు స్పష్టం చేశారు.

Videos

ప్రజా దర్బార్ లో పేదలను అవమానించిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

103 డాలర్లకు చమురు ధర

దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు

కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన

సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు

శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్

Sec-Bad: 800 కిలోల కుళ్లిన చికెన్

ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నటి మంచు లక్ష‍్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)