Breaking News

పేపర్‌ పరిశ్రమకు ‘పశ్చిమాసియా’ సెగ

Published on Tue, 03/17/2026 - 08:41

పశ్చిమాసియా సంక్షోభంతో దేశీ పేపర్‌ పరిశ్రమను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇంధన వ్యయాలు పెరిగిపోవడం, ఎగుమతులకు అవరోధాలతో వ్యాపారాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. మన పేపర్‌ పరిశ్రమకు కీలక ఎగుమతి మార్కెట్లలో పశ్చిమాసియా కూడా ఒకటిగా ఉంటోంది. 2024–25లో దేశీ పరిశ్రమ 980 మిలియన్‌ డాలర్ల పేపర్, పేపర్‌బోర్డును ఎగుమతి చేయగా అందులో పశ్చిమాసియా దేశాల వాటా 290 మిలియన్‌ డాలర్లుగా (సుమారు 30 శాతం) ఉన్నట్లు పేపర్‌ తయారీ సంస్థల సమాఖ్య ఐపీఎంఏ తెలిపింది.

అన్‌కోటెడ్‌ రైటింగ్‌..ప్రింటింగ్‌ పేపర్, కోటెడ్‌ పేపర్‌..పేపర్‌బోర్డ్, క్రాఫ్ట్‌ పేపర్‌ మొదలైనవి వీటిలో ఉన్నాయి. తమ పరిశ్రమలో ప్రధానంగా ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుందని, దీనితో భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం తమపైనా ఉంటోందని ఐపీఎంఏ వివరించింది. ఇంధన రేట్లు పెరిగిపోవడం, సరఫరాపరమైన అవరోధాల వల్ల దేశీ పేపర్‌ మిల్లుల ఉత్పత్తి వ్యయాలపై నేరుగా ప్రభావం పడుతోందని వివరించింది.  పేపర్‌ తయారీ ప్రక్రియకు అవసరమైన హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌..బైండర్స్‌లాంటి ఉత్పత్తులను సమకూర్చుకోవడంలో మిల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.

మరో వైపు, పేపర్‌ని ఉత్పత్తి చేసే చైనా, ఇండొనేషియాలాంటి దేశాలు ఎగుమతి కోసం పశ్చిమాసియాపై ఆధారపడతాయని, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల, సదరు ఉత్పత్తులను ఇప్పుడు అవి భారత్‌ వైపు మళ్లించే అవకాశం ఉందని ఐపీఎంఏ తెలిపింది. దీనితో చౌక దిగుమతులు వెల్లువెత్తి, దేశీ తయారీ సంస్థలపై ఒత్తిడి పెరిగిపోయే ముప్పు ఉందని వివరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడే ముప్పు నెలకొందని ఐపీఎంఏ ప్రెసిడెంట్‌ పవన్‌ అగర్వాల్‌ చెప్పారు.

ఇదీ చదవండి: దేశంలోనే టాప్‌ 10 రుణ ఎగవేతదారులు

Videos

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

జగన్ 2.0 ట్రేడ్ మార్క్ మొదటి ప్రాధాన్యత వాళ్లకే

టీడీపీ ఎంపీ పుట్టా డ్రగ్ కేసుపై జగన్ రియాక్షన్

కాంగ్రెస్‌కు గుడ్ బై... నేను పార్టీ మారడం ఖాయం

LIVE: నో యాక్షన్..? జగన్ సంచలన కామెంట్స్...

ఉగాది, రంజాన్ కు బిగ్ షాక్... నో గ్యాస్.. నో ఇండక్షన్..

ద్వారకా తిరుమలలో టికెట్ల స్కామ్ సీసీటీవీతో బయటపడిన మోసం

కూలేశ్వరం వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

10 ఏళ్లు మినిస్టర్ చేశావ్.. అసెంబ్లీలో KTR సెటైర్లకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)