Breaking News

ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావు ఫోటో.. ఎందుకంటే?

Published on Mon, 03/16/2026 - 15:22

ఆస్కార్ అవార్డుల వేడుక గ్రాండ్‌గా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్‌ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ దిగ్గజాలకు నివాళులర్పించారు. సినీ రంగంలో విశేషంగా రాణించిన టాలీవుడ్ దివంగత నటుడు కోట శ్రీనివాసరావును స్మరించుకున్నారు. ఆయనతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి లాంటి నటులకు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు. ఈ సినీ దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరిచారు.

వెండితెరపై తమదైన నటన, హావభావాలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న వీరికి ఘనంగా నివాళులర్పించింది ఆస్కార్ వేదిక. తెలుగు వెండతెరపై దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్‌ కలిగిన కోట శ్రీనివాసరావు గతేడాది జులై 13న మరణించారు. ఆ తర్పాత 89 ఏళ్ల వయసులో  ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. గతేడాది నవంబర్ 24న ఆయన మరణించారు.  సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం.. ధర్మేంద్రను పద్మ విభూషణ్‌తో సత్కరించింది.

అయితే ఆస్కార్‌ వేడుక ప్రారంభంలో గతేడాది మరణించిన హాలీవుడ్‌ ప్రముఖులకు నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు.
సినీ రంగానికి వారి సేవలను స్మరించుకుంటూ వారితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ వీడియోలో ధర్మేంద్రను చూపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ నెట్టింట అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. సమయాభావం వల్ల వీడియోలో కొందరినే చూపారని.. ఆ తర్వాత అందరి పేర్లను అఫీషియల్ సైట్‌లో ఉంచామని హాలీవుడ్‌ మీడియా క్లారిటీ ఇచ్చింది.

 

 

Videos

103 డాలర్లకు చమురు ధర

దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు

కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన

సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు

శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్

Sec-Bad: 800 కిలోల కుళ్లిన చికెన్

ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

జగన్ 2.0 ట్రేడ్ మార్క్ మొదటి ప్రాధాన్యత వాళ్లకే

Photos

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)