Breaking News

‘ఆస్కార్‌ 2026’లో అరుదైన ఘటన.. 14 ఏళ్ల తర్వాత తొలిసారి..

Published on Mon, 03/16/2026 - 09:31

సినిమా ప్రపంచంలో ప్రతిష్టాత్మక భావించే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుకకు హాలీవుడ్‌ కమెడియన్‌ కోనన్‌ ఓబ్రియన్‌ వ్యాఖ్యాతగా వ్యహరించాడు. భారత కాలమానం ప్రకారం మార్చి 16న ఉదయం 4:30 గంటలకు ఈ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం అయింది. అయితే ఈ సారి అస్కార్‌ వేదికపై అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓకే కేటగిరీలో ఇద్దరు విజేతలుగా నిలిచారు. 14 ఏళ్ల తర్వాత ఇలా ‘టై’ చోటు చేసుకోవడం గమనార్హం.

ఏ కేటగిరీలో?
ఒక్కో కేటగిరీ విజేతలకు ఒక్కో గెస్ట్‌తో అవార్డులను అందించారు. బెస్ట్ లైవ్‌ యాక్షన్‌ షార్ట్ ఫిల్మ్ విభాగంలోని విజేతలకు అవార్డులను అందించాల్సిందిగా నటుడు కుమాయిల్ నంజియాను స్టేజ్‌పైకి పిలిచారు. ఆయన వెళ్లి..తనకిచ్చిన ఎన్వలప్‌ ఓపెన్‌ చేసి ఏం మాట్లాడలేదు. దీంతో కాసేపు వేదికంతా సైలెంట్‌ అయిపోయింది. ఆయన ఎందుకలా సైలెంట్‌ అయిపోయాడో తెలియదు. కొన్ని క్షణాల తర్వాత.. . ఈ జాబితా టై అయిందని చెప్పడంతో డాల్బీ థియేటర్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఈ అవార్డుకు ‘ది సింగర్స్‌’, ‘టూ పీపుల్‌ ఎక్ఛ్సేంజ్‌ సలైవా’ చిత్రాలు ఎంపికైనట్లు ఆయన ప్రకటించడంతో అందరు గట్టిగా అరిచేశారు. ఈ సందర్భంగా నంజియా ఓ కామెడీ పంచ్‌ కూడా వేశాడు. ‘షార్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వడానికి రెట్టింపు సమయం పడుతుంది’అని ఆయన అనడం.. దానికి కొనసాగింపుగా ‘ఈ టై వల్ల బెట్టింగ్‌ చేసినవారి పరిస్థితి ఏంటో’ అని హోస్ట్ కోనన్ ఓబ్రియన్ చమత్కరించడంతో థియేటర్‌లో కాసేపు నవ్వులు పూశాయి.

ఏడు సార్లు ‘టై’
ఆస్కార్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఏడు సార్లు వివిధ కేటగిరీలో ‘టై’ అయింది. తొలిసారి 1932లో ఉత్తమ నటుడు విభాగంలో (వాలెస్‌ బిరీ, ఫ్రెడ్రిక్ మార్చ్) టై అయింది.  చివరిగా 14 ఏళ్ల క్రితం అంటే.. 2012లో ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో స్కైఫాల్, జీరో డార్క్ థర్టీ చిత్రాలకు అవార్డులను అందించారు. అలాగే 1994లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా  లైవ్ యాక్షన్, ఫ్రాంక్ కాఫ్కాస్ ఇట్స్ ఏ వండర్‌ఫుల్ లైఫ్, ట్రెవర్ చిత్రాలు నిలిచాయి. అంతకు ముందు 1986లో ఉత్తమ ఫీచర్ డాక్యుమెంటరీ విభాగాల్లో ఆర్టీ షా: టైమ్ ఈజ్ ఆల్ యూ హావ్ గాట్, డౌన్ అండ్ అవుట్ ఇన్ అమెరికా చిత్రాలకు అవార్డులు లభించాయి. ఇక 1968లో ఉత్తమ నటి విభాగంలో (కేథరిన్ హెప్బర్న్, బార్బరా స్ట్రీసాండ్), 1949లో ఉత్తమ డ్యాక్యుమెంటరీ కేటగిరీ (ఏ ఛాన్స్ టు లివ్, సో మచ్ ఫర్ సో లిటిల్)లో ‘టై’అయింది. 

Videos

కీచక డాక్టర్ కి బడితపూజ.. చెప్పులతో దేహశుద్ధి చేసిన మహిళలు

బాబు, పవన్ ఫోటోలు లేవని.. బీజేపీ ఫ్లెక్సీలు చింపేసిన టీడీపీ నేతలు

చంద్రబాబు అరెస్ట్.. రమణ రియాక్షన్.. KSR దిమ్మతిరిగే కౌంటర్

గ్యాస్ సిలిండర్ పై కేంద్రం కీలక ప్రకటన రెండున్నర రోజుల్లోనే డెలివరీ

చేపల వేటకు వెళ్లి.. మూసీలో మునిగిన ముగ్గురు యువకులు

నాని & వెంకీ మూవీ ఫిక్స్..!

పిన్నెల్లి సోదరులను హింసిస్తున్నారు. బాబుపై మిథున్ రెడ్డి హాట్ కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ అంతకు అంత అనుభవిస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్

ట్రంప్ కు బిగ్ షాక్.. యుద్ధానికి నో చెప్పిన మిత్రదేశాలు

ప్రత్యేక రాష్ట్రం సాధించిన పొట్టి శ్రీరాములుకు జగన్ నివాళులు

Photos

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)