డెలివరీ బాయ్‌గా 78 ఏళ్ల వ్యక్తి..!

Published on Sun, 03/15/2026 - 17:01

జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సానుకూలంగా స్పందించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే అది చెప్పినంత సులువు కాదు. ఒక్కోసారి ఈ వయసులో ఇంత కష్టమా అని తల్లడిల్లిపోతాం. కానీ కొందరే ధైర్యంగా ఎదురెళ్లతారు. అలాంటి వాళ్లకు ఆ దేవుడు సదా తోడుగా ఉంటాడనేందుకు ఈ తాతగారే ఉదాహరణ.

అమెరికాలోని టేనస్సీలోని మాంచెస్టర్‌కు చెందిన రిచర్డ్ పుల్లీ అనే 78 ఏళ్ల వ్యక్తి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆ వయసులో ఆ తాతగారి ఏం కష్టం వచ్చిందో అనిపిస్తుంది అతడు పడుతున్న తపన చూస్తే. వస్తువులను డెలివరీ చేసేందుకు వెళ్తున్నప్పుడూ.. వయసురీత్యా జారిపోయే అవకాశం ఉండటంతో ఎంతో జాగ్రత్తగా డెలివరీ చేస్తుంటాడు. నిజం చెప్పాలంటే అతడు తీసుకుంటున్న శ్రద్ధను చూస్తే ముచ్చటేస్తుంది. ఇంతలా కష్టపడుతూ డెలివరీ చేయడం ఎందుకని బాధ కూడా కలుగుతుంది. 

అలానే అనుకుంది బ్రిటనీ స్మిత్ అనే మహిళ కూడా స్టార్‌బక్స్‌ ఆర్డర్స్‌ డెలివరీ చేస్తున్న రిచర్డ్ పుల్లీని చూసి. అతడు డెలివరీ చేస్తున్న విధానానికి ఫిదా అయ్యి అందుకు సంబంధించిన వీడియోని షేర్‌ చేస్తూ..ఆ తాతగారి గురించి వివరించింది. ఆయన ఏడుపదుల వయసులో ఎందుకు ఇంకా పనిచేస్తున్నాడో కూడా తెలిపింది. ఫుల్లీ తన భార్య వైద్య ఖర్చులను నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలుపుతాడు. తన భార్య ఆమె తప్పిదం లేకుండానే ఉద్యోగం కోల్పోయిందని చెప్పుకొచ్చాడు ఫుల్లీ. 

దాని ఫలితంగా ఆమె ఆరోగ్య భీమా కూడా కోల్పోయింది. అందువల్ల తాను తమ జీవన ఖర్చుల తోపాటు మందులు, వైద్య ఖర్చులకు లెక్క చూస్తే..నెలాఖరుకి ఏమి ఉండదు. అందువల్ల ఇలా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు తెలిపాడు ఫుల్‌. తమది 56 ఏళ్ల వైవాహిక బంధమని చెప్పాడు. తన భార్య ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి ఒక ఏడాదికిపైగా ఇలా డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

దాంతో బ్రిటనీ స్మిత్‌ ఆ వృద్ధ దంపతులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో GoFundMe ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ దంపతులకు అండగా నిలిచేందుకు, వారి ఖర్చుల నిర్వహణలో సహాయపడేందుకు వేలాది మంది ప్రజలు ముందుకు వచ్చారు. ఏకంగా రూ. 4.5 కోట్లు దాక విరాళం రావడం విశేషం. 

(చదవండి: రూ. 9 వేలతో దుస్తుల వ్యాపారం ప్రారంభించి..ఇవాళ ఏకంగా రూ. 57 కోట్లు టర్నోవర్‌..)
 

Videos

మల్లారెడ్డి మల్టీ టాలెంట్.. సింగిల్ పీస్

నేను తప్పు చేయలేదు.. అడ్డంగా దొరికి బుకాయింపు

మీకోసమే.. ఆపిల్ ల్యాప్ టాప్ చౌక

మీకు తెలియని ఇరాన్ హిస్టరీ.. అమెరికాను చితక్కొడుతున్న ఎడారిదేశం

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)