Breaking News

'ఆయన గురించి పవన్ కల్యాణ్‌కు తెలియకపోయినా..'.. సింగర్ చిన్మయి పోస్ట్ వైరల్

Published on Sun, 03/15/2026 - 15:27

ప్రముఖ కోలీవుడ్ గేయ రచయిత వైరముత్తుకు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు అభినందనలు చెప్పడంపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో విమర్శలు చేస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ ట్వీట్‌ చేయడంపై చిన్మయి మండిపడింది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వైరముత్తుకు అభినందనలు చెప్పడంపై చిన్మయి అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంవో ఆఫీస్ నుంచి వైరముత్తుకు అభినందనలు రావడంపై కూడా చిన్మయి స్పందించింది. అసలు పవన్ కల్యాణ్‌ గారికి ఆ కవి గురించి ఏమీ తెలియదని నాకు కచ్చితంగా తెలుసు.. ఎంతోమంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆయనకు డిప్యూటీ సీఎంవో కార్యాలయం నుంచి అభినందనలు తెలపడం విచిత్రంగా ఉందని ట్వీట్‌ చేసింది. ‍అసలు ఒక సినిమా పాటల రచయితకు ఇంతమంది రాజకీయ నాయకులు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏంటో నాకిప్పటికీ అర్థం కావడం లేదంటూ చిన్మయి తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

కాగా.. మీటూ ఉద్యమ సమయంలో ప్రముఖ లిరిసిస్ట్ అయిన వైరముత్తుపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. చిన్మయితో పాటు పలువురు మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లోనూ చిన్మయి తన వాదన వినిపిస్తూనే ఉంది.

Videos

మీకు తెలియని ఇరాన్ హిస్టరీ.. అమెరికాను చితక్కొడుతున్న ఎడారిదేశం

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు

నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు

మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)