Breaking News

రూ. 9 వేలతో దుస్తుల వ్యాపారం ప్రారంభించి..ఇవాళ ఏకంగా రూ. 57 కోట్లు..

Published on Sun, 03/15/2026 - 13:57

సింగల్‌ మదర్‌ సక్సెస్‌ స్టోరీ ఇది. ఓ సాధారణ వీధి దుకాణం నుంచి బ్రాండ్‌ని నిర్మించే స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు బట్టలు అమ్ముడైతే చాలు అనుకునే స్థాయి నుంచి ఇవాళ ఏకంగా ఓ బ్రాండ్‌ వ్యస్థాపకురాలిగా కోట్లు గడిస్తూ..సక్సెస్‌కి చిరునామాగా మారిందామె. ఎవరామె అంటే..

చైనాలో డాంగ్‌ అనే మహిళ కేవలం రూ. 9,240లతో వీధి దుకాణం నడుపుతుండేది. 1990లలో హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్‌జౌలో నిర్మించిన డాంగ్‌ తన విజయవంతమైన దుస్తుల వ్యాపారం కారణంగా ప్రజలందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. 2012లో డాంగ్‌ వద్ద ఎలాంటి పొదుపులు, ఆదాయం లేక ఒంటిరి తల్లిగా రోడ్డుపై నిలబడిపోయింది. కనీసం తన బిడ్డకు పాలపొడిని కొనడానికి కూడా డబ్బులు లేని దారిద్యాన్ని అనుభవించింది. 

ఇరవైల వయసులో తన బిడ్డను పోషించుకోవాల్సిన పరిస్థితి ఆమెది. ఆ నేపథ్యంలో చిన్నగా వీధి వస్త్ర దుకాణాన్ని ప్రారంభించింది. అయితే వ్యాపారం అంతగా లాగాక.. ఇబ్బందిపడింది. ఒక్కోసారి ఈ వ్యాపారం తన వల్ల కాదేమో అన్నంతగా చేతులెత్తేసి దిగాలు పడేది. మళ్లీ ఆ క్షణంలోనే నేడు ఓడిపోతే..నా బిడ్డ బాధ్యతను ఎవరు చూసుకుంటారని భయపడేది. అయినా తాను పేదదాన్ని అయ్యిండొచ్చు, కానీ తన బిడ్డ ఎందుకు పేదవాడిగా ఉండాలన్న ఆలోచన తనకు వెనుకడగు వేయనివ్వని పట్టుదలను ఇచ్చేదట. 

అదే తనకు కఠినమైన ఆ పరిస్థితులను తట్టుకునే శక్తిని అందించిందట. తన వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రాత్రి మార్కెట్ల వైపుకి మొగ్గు చూపేదట. తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందాలంటే మంచి పరిచయాలు కూడా అవసరమని తెలుసుకుంది డాంగ్‌. అలా డబ్బు ఆదా చేస్తూ..స్టాక్‌ కొనడానికి ఉదయం ఐదుగంటల కల్లా మేల్కొనేది. తర్వాత రాత్రి కూరగాయల మార్కెట్‌ వెలుపల బట్టలు అమ్ముతుండేది. రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేది. 

బేరమాడటం, భారీ వస్తువులను తక్కువ ధరకే తీసుకెళ్లగలిగే మాట చాతుర్యం అన్నింటిని స్వయంగా నేర్చుకుంది. ఈ పనుల బిజీలో బిడ్డ ఆలనాపాలనా చూడటం కష్టంగా ఉండేది. ఒక్కోసారి రాత్రిపూట వీధుల్లో బిడ్డను ఒంటరిగా వదిలేసి వ్యాపారం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. అలా కష్టాలను ఓర్చుకుంటూ..నెమ్మదిగా రిటైల్‌ దుకాణాలను నడిపే స్థాయికి చేరుకుంది. 

అప్పుడే చైనీస్ సంప్రదాయాన్ని సమకాలీన డిజైన్‌తో మిళితం చేస్తూ ఒక ప్రసిద్ధ బ్రాండ్‌ను నిర్మించింది. ఈ బ్రాండ్‌కి చైనా దేశ్యవాప్తంగా గుర్తింపు వచ్చేలా అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో ఆమె ఏకంగా ఏడాదికి రూ. 54 కోట్లు పైనే గడించే స్థాయికి చేరుకుంది.  నెటిజన్లు సైతం ఆమె కథ విని ఒంటిరి తల్లి చాలా శక్తిమంతమైనది. ఎన్ని కష్టాలు ఓర్చుకుందో ఆమెకే తెలుసు అంటూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: 76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!)
 

Videos

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు

నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు

మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు

డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)