Breaking News

బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..

Published on Sun, 03/15/2026 - 11:44

బంగారం ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. గడచిన వారం రోజుల్లో గోల్డ్, సిల్వర్ రేటు గణనీయంగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో, పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేట్లలో జరిగిన మార్పు గురించి, నేటి ధరల గురించి తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో మార్చి 9(సోమవారం)న 1,61,680 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, ఈ రోజుకి (మార్చి 15) 1,59,660 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ. 2020 తగ్గిందన్న మాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,48,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,46,350 వద్దకు (రూ.1850 తగ్గింది) చేరింది.

ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వారం రోజుల్లో గణనీయంగా తగ్గింది. మార్చి 9న.. అంటే సోమవారం రోజు 1,61,830 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. నేటికి (మార్చి 15) రూ.1,59,810 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఏడు రోజుల్లో రూ.2020 తగ్గింది. 22 క్యారెట్ల పసిడి రేటు 1,48,350 రూపాయల నుంచి రూ.1850 తగ్గి 1,46,500 రూపాయల వద్దకు చేరింది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర వారం రోజుల్లో 1,63,090 రూపాయల దగ్గర నుంచి 1,61,020 రూపాయల దగ్గరకు చేరింది. వారం రోజుల్లో రూ. 2070 తగ్గిందన్నమాట. తులం 22 క్యారెట్ల బంగారం రేటు 1,49,500 రూపాయల నుంచి రూ. 1,47,600 వద్దకు (రూ.1900 తగ్గింది) చేరింది.

వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. మార్చి 9న రూ.2.90 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు నేటికి (మార్చి 15) రూ.2.80 లక్షలకు చేరింది. వారం మధ్యలో రేట్ల పెరుగుదల, తగ్గుదల ఉన్నప్పటికీ.. మొత్తం మీద కేజీ రేటు 10,000 రూపాయలు తగ్గిందని తెలుస్తోంది.

Videos

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు

నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు

మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు

డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)