Breaking News

మాటే మెసేజ్, జూ.ఎన్టీయార్‌కు సాటిలేని ఇమేజ్‌..

Published on Sun, 03/15/2026 - 08:43

జనం మనసుల్ని గెలుచుకున్న సెలబ్రిటీల మాటలకు చాలా విలువ ఏర్పడుతుంది. అయితే ఆ విలువను పెంచుకునేలా మాట్లాడడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. విలువ పెంచుకోవడం మాట దేవుడెరుగు కనీసం తమ వయసుకు, సామాజిక హోదాకు తగ్గట్టుగా కూడా మాట్లాడలేకపోతున్న రోజులవి.. పారేసుకున్న నోరుని,సారీలతో కడుక్కోలేక అవస్థలు పడుతున్న నోటిదూల రాయుళ్ల కాలమిది. ఇలాంటి పరిస్థితుల్లో... తప్పకుండా ప్రస్తావించుకోవాల్సిన టాప్‌ సెలబ్రిటీ జూనియర్‌ ఎన్టీయార్‌.



‘‘మహిళల్ని గౌరవించండి అంటూ ఇంకా స్కూల్స్‌లో కాలేజీల్లో చెప్పడం కాదు... అలాంటివి నేర్పడం ఇంటి దగ్గరే ప్రారంభం కావాలి’’ అంటూ ఆయన ఇటీవల ఒక ప్రైవేటు ఆసుపత్రి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అన్నారాయన. అంతేకాదు తన పిల్లల్ని మహిళలకు గౌరవం ఇచ్చేలా పెంచుతానని మాట ఇస్తున్నానంటూ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. ఇదొక్కటే కాదు గత కొంత కాలంగా జూ.ఎన్టీయార్‌ రకరకాల సందర్భాల్లో మాట్లాడిన మాటలు గమనిస్తే  నలుగురికి మంచి చెప్పాలనే ఆయన తాపత్రయం  కనిపిస్తుంది.

 

‘‘ ఆపరేషన్‌ ధియేటర్లో మృత్యువుతో పోరాడుతున్న రోగి లాంటిది సినిమా విడుదల సమయం.. ఆ రోగి ప్రాణం నిలుస్తుందా లేదా అని సంబంధీకులు అందరూ టెన్షన్‌ పడుతుంటారు. అలాంటి సమయంలో ఆపరేషన్‌ కాకుండానే, రోగిని చంపేయకండి’’ అంటూ ఆయన బాధ్యతా రహితంగా రివ్యూలు రాసి పారేసే సినిమా సమీక్షకుల్ని అభ్యర్ధించిన తీరు చాలా మందికి ఎప్పటికీ గుర్తుంటుంది. ఓ సినిమా కార్యక్రమంలో ఆయన మాట్లాడిన ఈ మాటలు పలువురు రివ్యూయర్లను సూటిగా తాకాయి. 

 

అలాగే అరవింద సమేత  సినిమా కార్యక్రమంలో ‘జీవితం అంటే కొట్టుకోవడం జీవితం అంటే తిట్టుకోవడం కాదు జీవితం అంటే బతకడం’’ అంటూ మాట్లాడి ఆకట్టుకున్నారు.. ‘‘గెలిచినా ఓడినా..... ఏది జరిగినా పదిమందికీ సమాధానం చెప్పాల్సిందే. మనదైన రోజున గెలుస్తాం కాని రోజున ఓడిపోతాం కానీ ప్రతీ రోజూ ప్రయత్నిస్తూనే ఉండాలి’ అంటూ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాటలివి. 

‘‘ప్రకృతితో కలిసి జీవించడం మాత్రమే కాదు దానిని గౌరవించడం కూడా నేర్చుకోవాలి..ఎందుకంటే అది లేకపోతే మనం నథింగ్‌’’అంటూ ఓ అవార్డ్‌ ఫంక్షన్‌లో ఆయన మాట్లాడిన మాటలు అతిరధ మహారధుల హర్షధ్వానానాలను అందుకున్నాయి.

‘‘గొప్ప కల కనడానికి ధైర్యం ఉండాలి దానిని నిజం చేసుకోవడానికి కఠినమైన క్రమశిక్షణ దానితో పాటే భయం కూడా ఉండాలి’’ అంటూ ఓ యువ హీరో చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ సందర్భంగా అంటాడు యంగ్‌ టైగర్‌. ‘‘ నెగిటివిటీ చాలా శక్తివంతమైనది. అది ఒక్కసారిగా వచ్చి మీదపడిపోతుంది. అదే పాజిటివిటీ అలా కాదు చాలా నిదానంగా మనలో పుట్టి పెరుగుతుంది. మన పిల్లల్లాగా మనం దాన్ని పెంచుకుంటూ పోవాలి’ అంటూ మరో సందర్భంగా చెబుతాడు. 

‘‘గెలుపోటములకు ఎవరూ అతీతులు కారు. నువ్వు కిందకు పడితేనే కదా లేవాలని అనుకుంటావు. ప్రతీ చర్యకూ ప్రతిచర్య ఉంటుంది. నువ్వు ఎంత వేగంగా కిందకు పడిపోతే అంతకు రెట్టింపు వేగంతో పైకి లేస్తావు’’  ‘‘విజయం ఆత్మవిశ్వాసం ఇస్తుంది ఓటమి కూడా తర్వాత విజయం సాధిస్తాననే కాన్ఫిడెన్స్‌ ఇస్తుంది. అందుకే జయాపజయాల కన్నా, ఆత్మవిశ్వాసమే ముఖ్యం’’అంటూ ప్రతీ ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలిపే ఆయన ప్రయత్నం అభినందనీయం అనకుండా ఉండగలమా?

 ‘‘నాలెడ్జ్‌ అంటే పాఠశాలల్లో , కళాశాలల్లో నేర్పేది కాదు.. అది మనం సంపాదించుకునేది. మన ప్రయాణించే దారిలో చూసిన సంఘటనలు ఎదుర్కున్న ఆటుపోట్లు అందిస్తాయి చూడండి అదే నాలెడ్జ్‌’’ అంటూ నేర్చుకోవాల్సింది ఏమిటో నేర్పుగా చెబుతాడు.

పెద్ద ఎన్టీయార్‌లాగా తెరపై డైలాగులను దంచడంలో దిట్ట... తెరబయట పదిమంది మంచి కోరి మాట్లాడగల సామర్ధ్యం కూడా జూ. ఎన్టీయార్‌ స్వంతం. అందుకే ఆయన గత కొంత కాలంగా విభిన్న సందర్భాల్లో మాట్లాడిన మాటలు నెట్టింట్లో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ‘‘ఇక్కడ ఎవరూ శాశ్వతంగా ఉండబోవడం లేదు. శాశ్వతంగా ఉండేది మంచి పేరు మాత్రమే’’ అంటూ తరచుగా చెబుతారు జూ.ఎన్టీయార్‌. 

ఒక వ్యక్తిలో ఉన్న టాలెంట్‌కు జనం జై కొడతారు అంతమాత్రానే కళ్లు నెత్తికెక్కి నోరు పారేసుకుంటే అదే జనం ఛీ కొడతారు. తారలు అని కీర్తించినంత మాత్రాన వారు తాము ఉంటున్న ఆకాశం అనుకోకూడదు.. ఇది తమకు వచ్చిన అవకాశం అనుకోవాలి. మంచిగా ఉండేందుకు,  ప్రతీ ఒక్కరిలో మంచిని పెంచేందుకు ...మంచి అవకాశం అని భావించాలి. అప్పుడే ప్రతీ సెలబ్రిటీ మాట మంత్రం అవుతుంది. పదిమంది అనుసరించే సూత్రంగా మారుతుంది.

Videos

ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు

నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు

మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు

డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు

టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసుపై పోలీసుల షాకింగ్ నిజాలు

ధోని, రోహిత్ తర్వాత శ్రీయాస్ అయ్యరే బెస్ట్ కెప్టెన్..

సిమ్లా నుంచి కొకైన్.. డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ

టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ.. ఎంపీ పుట్టా మహేష్ పై సీరియస్

#RC17 సెట్స్ పైకి ఎప్పుడంటే..?

కేసు బయటకు రాకూడదంటూ తెలంగాణ పోలీసులకు బెదిరింపు..?

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)