Breaking News

మిషన్‌ నొక్కితే డబ్బే డబ్బు.. కాన్‌ సిటీ టీజర్‌ చూశారా?

Published on Mon, 03/09/2026 - 18:53

డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్‌ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు. దాదాపు అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్న తమిళ సినిమా "కాన్‌ సిటీ". కాకపోతే ఇక్కడ డబ్బులు చెట్లకు కాకుండా ఓ మిషన్‌కు కాస్తున్నాయి. అవును, బటన్‌ నొక్కితే చాలు లిమిట్‌ అనేదే లేకుండా ఎన్నిసార్లంటే అన్నిసార్లు డబ్బులు ప్రింట్‌ చేస్తూనే ఉంది.

డబ్బులు ప్రింట్‌ చేసే మిషన్‌
సోమవారం సాయంత్రం కాన్‌సిటీ తెలుగు టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో.. డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావని ఓ గంభీర స్వరం ఫోన్‌లో హీరోను నిలదీస్తుంది. దాంతో అసహనానికి లోనైన హీరో వస్తువులన్నింటినీ కిందపడేస్తాడు. అప్పుడే ఒక మిషన్‌ను సైతం కిందపడేయబోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పిడుగు పడి యంత్రం ఆన్‌ అవుతుంది, అందులో నుంచి రూ.500 నోటు బయటకు వస్తుంది. ఇంకేముంది.. నొక్కిన ప్రతిసారి నోట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది.

చేతులు మారిన యంత్రం
దాంతో ఆ డబ్బంతా బ్యాగులో సర్దుకున్న హీరో ఆ యంత్రాన్ని  జాగ్రత్తగా అల్మారాలో పెడతాడు. కట్‌ చేస్తే బట్టలు సర్దే సమయంలో భార్యకు ఆ మిషన్‌ కనిపిస్తుంది. బటన్‌ నొక్కితే డబ్బు వస్తుండటంతో దాన్ని తీసుకెళ్లి వంటగదిలో దాచేస్తుంది. అక్కడి నుంచి అది హీరో తల్లి చేతికి వెళ్తుంది. ఆమె దాన్ని పూజగదిలో దేవుడి ఫోటో వెనకాల భద్రపరుస్తుంది. తర్వాత సడన్‌గా మిషన్‌ కనిపించకుండా పోతుంది. 

వీధిలో నోట్ల వర్షం
ఇంటిల్లిపాది అంతా వెతుకుతారు. తీరా చూస్తే హీరో కొడుకు ఆ యంత్రంతో బాల్కనీలో ఆడుకుంటాడు. ఇంకేముంది, నడిరోడ్డులో డబ్బుల వర్షం.. దాన్ని దక్కించుకునేందుకు వీధిలో జనం ఎగబడుతుంటారు. మరిం తర్వాతేం జరిగిందో తెలియాలంటే కాన్‌ సిటీ చూడాల్సిందే! హరీశ్‌ దురైరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్‌ మూవీకి సేన్‌ రోల్డన్‌ సంగీతం అందించాడు. అర్జున్‌ దాస్‌, అన్నాబెన్‌, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రాన్ని టీ సిరీస్‌ తెలుగులో తీసుకురానుంది.

 

Videos

10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే

పరకామణిలో బంగారం చోరీ కేసు.. BR నాయుడు ఇప్పుడు మాట్లాడు!

మల్లంపేట నుంచి బాచుపల్లి కనెక్టింగ్ పేరుతో రోడ్డు నిర్మాణం

అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఫైట్ అసలు కారణం ఇదే..

టాస్క్ ఫోర్స్ లా ఏర్పడి పని చేద్దాం ఓటర్ల జాబితా సవరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు

మీకు 17 వరకు టైం ఇస్తున్న.. జడ శ్రవణ్ వార్నింగ్..

రోగులను గాలికొదిలేసి.. ఐటెం సాంగ్ కు నర్సుల డ్యాన్స్

మాటకు మాట.. రేవంత్ రెడ్డి, కేటీఆర్

టెహ్రాన్‌పై డైరెక్ట్ ఎటాక్ ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యం

AP: తిరుమల వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా ఇందాపూర్ డైరీదేనా?

Photos

+5

చీరలో పవర్‌‌ఫుల్‌గా హీరోయిన్ ధన్సిక (ఫొటోలు)

+5

సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్‌‌ హైలైట్స్‌.. (ఫొటోలు)

+5

టీ–20 వరల్డ్‌ కప్‌ : హైదరాబాద్ లో క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా హీరోయిన్ శ్రద్ధాదాస్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

'మృత్యుంజయ్' థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)

+5

తమిళనాడు డివోషనల్ ట్రిప్‌లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)