10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే
Breaking News
చీరకట్టులో స్నోబోర్డింగ్ స్టంట్..!
Published on Sun, 03/08/2026 - 15:59
స్కేటింగ్, స్నోబోర్డింగ్ వంటివి చీరతో సాధ్యమయ్యేవి కావు. అందులోనూ మంచు పర్వతాల్లో రెయ్‌రెయ్ మని వెళ్లాలంటే శారీతో సాధ్యమైన పనికాదు. కానీ ఇద్దరు మహిళలు చీరతో చాలా ఈజీగా చెయ్యొచ్చని చూపించి అందర్నీ షేక్ చేశారు. భారతీయతను ఉట్టిపడేలా చేసే చీరకట్టుతో చేసిన స్నోబోర్డింగ్ అందర్నీ కట్టిపడేసింది. ఆరుగజాల చీరలో ఊర్మిలా పేబుల్, లిండా ష్మిటర్ అనే ఇద్దరు మహిళలు మంచు పర్వతాల్లో చాలా చక్కగా స్కోబోర్డింగ్ చేసి నోటమాట రాకుండా చేశారు.
ప్రొఫెషనల్ అథ్లెట్లు అయినా ఈ ఇద్దరూ చీరకట్టుతో స్నోబోర్డింగ్ చేసే థ్రిల్ కోసం చేసినా..అందర్నీ ఆలోచించేలా చేసింది. భారతీయురాలైన ఊర్మిలా పేబుల్, తన స్విస్ స్నేహితురాలితో కాశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో మంచుకొండలపై ఈ స్టంట్ చేశారు. అందుకు సంబంధించిన కమనీయ దృశ్యాల్ని స్వీడిష్‌లో జన్మించిన అడ్వెంచర్ ఫిల్మ్ మేకర్, డ్రోన్ పైలట్ అయిన హెరాల్డ్ ఎడ్లండ్ కెమెరాలో బంధించారు. ఊర్మిళ, లిండా మాదిరిగానే, అతను పారాగ్లైడింగ్, స్పీడ్‌ఫ్లైయింగ్ వంటి అనేక హై-ఇంటెన్సిటీ అడ్వెంచర్ క్రీడలపై ఆసక్తితోపాటు, పర్వత ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించడంలో నిపుణుడు.
అయితే ఆ దృశ్యాలకు "శారీ నాట్ సారీ" అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఊర్మిలా పేబుల్. ఇదిలా ఉండగా, ఊర్మిలా 19 ఏళ్ల ఉత్సాహభరితమైన ప్రొఫెషనల్ స్కేట్‌బోర్డర్. ఐదేళ్ల వయసులో రోలర్ స్కేటింగ్ నేర్చుకుంది. అలా ఆమెకు స్కేట్ బోర్డింగ్ పట్ల మక్కువ పెరిగింది. ఇక లిండా ష్మిటర్ స్విట్జర్లాండ్, హిమాలయాలు, వంటి దిగ్గజ ప్రదేశాలలో సాహసోపేతమైన కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది. అలాగే ఆమెకు బర్టన్, మమ్ముట్ వంటి ప్రధాన బహిరంగ స్నోబోర్డింగ్ బ్రాండ్‌ల నుంచి అనేక స్పాన్సర్‌షిప్‌లు కూడా వచ్చాయి.
(చదవండి: ఫ్లైట్ వాష్‌రూమ్‌ని జిమ్‌గా మార్చేశాడుగా..!)
Tags : 1