Breaking News

ఓటీటీలో 'ది తాజ్‌ స్టోరీ'.. వివాదస్పద సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Published on Sun, 03/08/2026 - 10:47

బాలీవుడ్‌ నటుడు పరేశ్‌ రావల్‌ నటించిన చిత్రం ‘ది తాజ్‌ స్టోరీ’. సుమారు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి ఈ చిత్రం రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.  అక్టోబర్ 31, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం వివాదాస్పదంగా నిలిచింది. సురేశ్‌ ఝూ ఈ మూవీని నిర్మించగా.. దర్శకుడు తుషార్‌ అమ్రిష్‌ గోయెల్‌ తెరకెక్కించారు. జాకీర్‌ హుస్సేన్, అమృత ఖాన్విల్కర్, స్నేహ వాఘ్, నమిత్‌ దాస్‌ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు.

ది తాజ్‌ స్టోరీ మూవీ  లయన్స్‌గేట్ ప్లే(Lionsgate Play)లో ప్రసారం కానుంది. మార్చి 13 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ్‌ భాషలలో స్ట్రీమింగ్‌ కానుంది. తాజ్‌మహల్‌ను నిర్మించింది నిజంగా షాజహానా..? లేకపోతే దాని వెనుక ఏదైనా తెలియని రహస్యం ఉందా..? అనే పరిశోధన ఆధారంగా  ఈ చిత్రాన్ని తీశారు. సినిమా పోస్టర్‌ విడుదల సమయంలో తీవ్రమైన వివాదం కొనసాగింది. తాజ్‌ మహల్‌ నుంచి శివుని విగ్రహం బయటకు వస్తున్న దృశ్యంతో విడుదలైన  పోస్టర్‌ అనేక చర్చలకు దారితీసింది. విష్ణు దాస్ అనే టూర్ గైడ్ తాజ్ మహల్ వెనుక దాగిఉన్న నిజమైన చరిత్రను వెలికితీసే ప్రయాణమే ఈ చిత్రం.

తాజ్ మహల్ ఒక పురాతన శివాలయం ("తేజో మహాలయ") అని, దీనిని షాజహాన్ ఆక్రమించి సమాధిగా మార్చాడని చరిత్రకారుడు పి.ఎన్. ఓక్ వాదించిన వివాదాస్పద సిద్ధాంతం. ఇది శివాలయమని, 4వ శతాబ్దంలో రాజా పరమార్ధి దేవ్ నిర్మించారని, 17వ శతాబ్దంలో షాజహాన్ దీనిని మార్చారని కొందరు నమ్ముతారు, కానీ పురాతత్వ శాఖ దీనిని నిరాకరించింది. ఇదే పాయింట్‌తో సినిమా ఉందని వాదనలు రావడంతో చరిత్రకారులు, న్యాయవాదులు ఈ విషయంపై  కోర్టులో పోరాటానికి దారితీసింది.

Videos

ఆడియో నాయుడు.. వీడియో నాయుడు.. బాబు, BR నాయుడు పై రోజా సెటైర్లు

నల్గొండలో కారు బీభత్సం.. షాకింగ్ వీడియో

గౌతమ్ గంభీర్ సరికొత్త చరిత్ర

గోల్డ్ మార్కెట్ లో భారీ ట్విస్ట్.. ఒక్కరోజులోనే అమాంతం పెరిగిన బంగారం ధరలు..

దుబాయ్ పై ఇరాన్ బాంబుల వర్షం.. బుర్జ్ ఖలీఫా ఎలా ఉందంటే

నెయ్యి ధరల పెంపు.. టీటీడీ నిధుల దోపిడీ?

మహిళల ఫొటోలు తీసి.. మంగళగిరిలో టీడీపీ కార్యకర్త అరాచకాలు

ఆటలు, పాటలు, డాన్సులు.. హోమ్ మంత్రి పదవి తప్ప అన్ని చేస్తున్నావ్

చరిత్ర సృష్టించిన భారత్

మహిళలకు మోసం? బాబు డ్రామాలపై జగన్ ఫైర్!

Photos

+5

#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్‌‌ హైలైట్స్‌.. (ఫొటోలు)

+5

టీ–20 వరల్డ్‌ కప్‌ : హైదరాబాద్ లో క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా హీరోయిన్ శ్రద్ధాదాస్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

'మృత్యుంజయ్' థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)

+5

తమిళనాడు డివోషనల్ ట్రిప్‌లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)

+5

రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)

+5

మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)