Breaking News

100 ఎకరాలు ఉంటే చెప్పండి: మీనాక్షి

Published on Sun, 03/08/2026 - 07:01

మన నటీమణీల ఆశలు, కోరికలు కాస్త ఎక్కువగానే ఉంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా తమ జీవిత భాగస్వామి విషయంలో ఒక్కొక్కరి కోరికలు ఒక్కోలా ఉంటాయి. కొందరు మంచి మనిషై ఉంటే చాలంటారు. మరికొందరు నా మనసెరిగి నడుచుకోవాలంటారు. ఇంకొందరు తమను గౌరవించే వారై ఉండాలంటారు. కాగా మీనాక్షి చౌదరి ఎలాంటి భర్త కావాలంటున్నారో తెలుసా?  తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన బ్యూటీ ఈ అమ్మడు. తెలుగులో హిట్‌ చిత్రం ద్వారా కథానాయిక కాగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మీనాక్షిచౌదరి. 

ఇదేవిధంగా తమిళ చిత్ర పరిశ్రమలోకి విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన కొలై చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఆర్‌ జే.బాలాజి సరసన సింగపూర్‌ సెలూన్‌ చిత్రంలో నటించినా, రాని గుర్తింపు విజయ్‌కి జంటగా నటించిన గోట్‌ చిత్రంతో వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ చిత్రంలో ఈమె పాత్ర పరిమితమే.గోట్‌ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు . హీరో విజయ్‌ అన్న ఒక్క పేరు వల్లే నటి మీనాక్షిచౌదరి పేరు పాపులర్‌ అయింది. 

ఆ తరువాత దుల్కర్‌ సల్మాన్‌కు జంటగా నటించిన లక్కీ భాస్కర్‌ మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత తెలుగులో మహేష్‌బాబుతో కలసి గుంటూరు కారం, వెంకటేశ్‌తో సంక్రాంతికి వస్తున్నాం, తాజాగా అనగనగా ఒక రాజు వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించారు. కాగా ఇటీవల  ఒక ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అన్న విషయం గురించి ఆమె పెద్ద లిస్టే చెప్పారు. అవి ఏమిటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి కనీసం 100 ఎకరాల ఆస్తి పరుడై ఉండాలి. వంట తెలిసినవాడై ఉండాలి. బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం తెలిసినవారై ఉండాలి. మొత్తం మీద ఇంట్లో అన్ని పనులు చూసుకోవాలి అని  మీనాక్షి చౌదరి పేర్కొన్నారు.  

Videos

ఆడియో నాయుడు.. వీడియో నాయుడు.. బాబు, BR నాయుడు పై రోజా సెటైర్లు

నల్గొండలో కారు బీభత్సం.. షాకింగ్ వీడియో

గౌతమ్ గంభీర్ సరికొత్త చరిత్ర

గోల్డ్ మార్కెట్ లో భారీ ట్విస్ట్.. ఒక్కరోజులోనే అమాంతం పెరిగిన బంగారం ధరలు..

దుబాయ్ పై ఇరాన్ బాంబుల వర్షం.. బుర్జ్ ఖలీఫా ఎలా ఉందంటే

నెయ్యి ధరల పెంపు.. టీటీడీ నిధుల దోపిడీ?

మహిళల ఫొటోలు తీసి.. మంగళగిరిలో టీడీపీ కార్యకర్త అరాచకాలు

ఆటలు, పాటలు, డాన్సులు.. హోమ్ మంత్రి పదవి తప్ప అన్ని చేస్తున్నావ్

చరిత్ర సృష్టించిన భారత్

మహిళలకు మోసం? బాబు డ్రామాలపై జగన్ ఫైర్!

Photos

+5

#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్‌‌ హైలైట్స్‌.. (ఫొటోలు)

+5

టీ–20 వరల్డ్‌ కప్‌ : హైదరాబాద్ లో క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా హీరోయిన్ శ్రద్ధాదాస్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

'మృత్యుంజయ్' థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)

+5

తమిళనాడు డివోషనల్ ట్రిప్‌లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)

+5

రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)

+5

మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)