Breaking News

జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ!

Published on Fri, 03/06/2026 - 16:28

ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే అవసరం వద్దనుకునేవారి కోసం రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో ఒకటి సెలక్ట్ చేసుకుంటే.. 200 కంటే ఎక్కువ రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రూ.1748 ప్లాన్
రూ. 1748 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు డేటా లభించదు. ఇది పూర్తిగా వాయిస్-ఓన్లీ ప్లాన్ అనే విషయం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం జియోటీవీ, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్‌కు యాక్సెస్‌ అందిస్తుంది. ఈ ప్లాన్ సీనియర్ సిటిజన్లకు లేదా సెకండరీ నంబర్‌ను ఉపయోగించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

రూ.2025 ప్లాన్
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా (మొత్తం 500 జీబీ), అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. ఇవి కాకుండా కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్‌స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్‌స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్‌, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.

రూ.3599 ప్లాన్
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఏడాదిపాటు (365 రోజులు) వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. వీటితో పాటు కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్‌స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్‌స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్‌, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.

రూ.3999 ప్లాన్
రూ. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. అర్హత కలిగిన వినియోగదారులు అపరిమిత 5G డేటాను పొందుతారు. హై-స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత వేగం 64Kbpsకి పడిపోతుంది.

Videos

ఏ దేశంలో ఎన్ని అణుబాంబులున్నాయి? మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా

పావలా శ్యామలకు బన్నీ భరోసా..!

UPSC సివిల్స్ ఫలితాలు విడుదల టాపర్స్ వీళ్లే

బ్లూ స్పేరోతో ఖమేనీపై దాడి ఇజ్రాయెల్ కీలక ప్రకటన..

భీకర యుద్ధం.. ఇరాన్ గుండెల్లో బాంబుల వర్షం

ఈనెల 11 నుంచే ప్రభుత్వ సంస్థ.. ఏకంగా రూ.6000 కోట్లు.. రెడీగా ఉండండి..

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి

11 మంది 1100 మందితో సమానం..! YSRCP పై పవన్ షాకింగ్ వ్యాఖ్యలు

ఏపీ మండలిలో బొత్సకు స్వల్ప అస్వస్థత

పెద్ది మళ్ళీ పోస్టుపోన్..! APR 30 కాదు.. ఎప్పుడంటే..?

Photos

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకలో విజయ్‌, త్రిష సందడి.. ఫోటోలు వైరల్

+5

నిజామాబాద్‌లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

టి20 ప్రపంచకప్‌లో తుది పోరుకు భారత్‌ (ఫొటోలు)

+5

భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ ప్రొద్దుటూరు పర్యటన (ఫొటోలు)