శుభ్ ఫ్లెక్సి పెన్షన్.. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్

Published on Thu, 03/05/2026 - 19:28

జీవించినంత కాలం నిరంతర ఆదాయం అందుతుందనే భరోసాతో రిటైర్ కావడాన్ని ఒకసారి ఊహించుకోండి. మీ పొదుపులు స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పెరుగుతూ మీ జీవనశైలిని కొనసాగించేందుకు సహాయపడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అచ్చంగా ఈ ఆలోచనకే వాస్తవ రూపం ఇచ్చేలా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’ను ఆవిష్కరించింది. మీరు ధీమాగా, సౌకర్యవంతంగా, ఆర్థిక భద్రత దన్నుతో పదవీ విరమణను ప్లాన్ చేసుకునేందుకు తోడ్పడేలా ఇది తీర్చిదిద్దబడింది.

నేటి రిటైర్మెంట్ - సరికొత్త పరిస్థితులు
ప్రస్తుతం రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మాత్రమే కాదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక అవసరం. ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం వల్ల రిటైర్ అయిన వారిపై ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది రిటైర్మెంట్ అనంతరం కూడా తమ జీవనశైలిని కొనసాగిస్తూ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. అందుకే స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలు కలిగిన స్మార్ట్ ఫైనాన్షియల్ పరిష్కారాల కోసం చూస్తున్నారు.

ఇప్పటి రిటైరీలు కారు కొనడం లేదా విదేశీ పర్యటనలు చేయడం వంటి లక్ష్యాల గురించి కూడా కలలు గంటున్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ (FIRE) తరానికి చెందిన వారు కావచ్చు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు కావచ్చు లేదా ఉద్యోగ మార్పుల మధ్యలో ఉన్నవారు కావచ్చు, ఇలా చాలా మందికి సంప్రదాయ పెన్షన్ పథకాలు సరిపోవడం లేదు. అంతేకాదు, జీవితకాలం ముగిసేలోగానే, దాచుకున్న డబ్బు పూర్తిగా ఖర్చయిపోతుందనే భయం కూడా చాలా మందిలో ఉంది.

అయితే రిటైర్మెంట్ జీవితం గురించి ఆందోళన చెందే పరిస్థితి లేకపోతే ఎలా ఉంటుంది? నిర్దిష్ట హామీతో కచ్చితమైన ఆదాయం పొందుతూ మార్కెట్ వృద్ధి అవకాశాలను కూడా పొందగలిగితే ఎలా ఉంటుంది?

‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’ అచ్చంగా అలాగే ఉంటుంది. ఈ పథకం ద్వారా భద్రతతో పాటు వృద్ధి అవకాశాలు కూడా లభిస్తాయి. దీంతో మీరు కోరుకున్న జీవనశైలి విషయంలో రాజీపడాల్సిన అవసరం లేకుండా, ధీమాగా రిటైర్ కావచ్చు.

రిటైర్మెంట్ ప్లానింగ్‌కు స్మార్ట్ మార్గం
ఆయుర్దాయం పెరుగుతుండటం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం వల్ల ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతోంది. సంప్రదాయ రుణాధారిత పెన్షన్ పథకాలు భరోసా ఇస్తాయి కానీ ఆదాయం పెరిగే అవకాశం ఉండదు. మరోవైపు సూచీ ఆధారిత పెట్టుబడులు వృద్ధి అవకాశాలను ఇస్తాయి కానీ స్థిరత్వం ఉండదు. అలాంటప్పుడు ఈ రెండు ప్రయోజనాలు ఒకే పథకంలో లభిస్తే ఎలా ఉంటుంది?

శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ జీవితాంతం హామీ ఆదాయాన్ని అందిస్తుంది. ఈక్విటీల్లో 40 శాతం వరకు పెట్టుబడుల దన్నుతో ఇది అదనంగా మార్కెట్ ఆధారిత వృద్ధి అవకాశాలను కూడా అందిస్తుంది. ‘ఈక్విటీ ఓరియెంటెడ్, రెగ్యులర్ పే’ సొల్యూషన్‌గా ఈ పథకం ఇలా పనిచేస్తుంది.

జీవితాంతం హామీతో కూడుకున్న ఆదాయం
మీరు జీవించినంతకాలం యాన్యుటీ రూపంలో ఆదాయం అందుతుంది. రిటైర్మెంట్ సమయంలో డబ్బు సరిపోదేమోనని ఆందోళన చెందనక్కర్లేదు.
మార్కెట్ ఆధారిత వృద్ధికి అవకాశం
వేరియబుల్ యాన్యుటీ ఆప్షన్ ద్వారా మీ ఆదాయంలో కొంత భాగాన్ని NIFTY 50 పనితీరుకు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందులో ఈ ఆప్షన్లు ఉన్నాయి:
➤60% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 40% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)
➤70% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 30% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)
➤80% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 20% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)
➤90% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 10% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)

ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనగలిగేలా, మీకు ఒక స్థిరమైన ఆదాయం ఉండడమే కాకుండా మార్కెట్ పెరుగుదలతో మీ పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉండేలా చూసేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది.

“భారతదేశంలో రిటైర్మెంట్ ప్లానింగ్ విధానం మారుతోంది. ఆయుర్దాయాలు పెరగడం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం, వడ్డీ రేట్లు మారడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలను కూడా అందించే సాధనాలను కోరుకుంటున్నారు. శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు హామీతో కూడుకున్న ఆదాయం మరియు పొదుపు మొత్తాన్ని పెంచుకునే అవకాశం, ఇలా రెండింటినీ అందిస్తున్నాం,” అని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ యాక్చువరీ క్షితిజ్ శర్మ తెలిపారు.

మీ రిటైర్మెంట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడినది
ప్రతి ఒక్కరి రిటైర్మెంట్ లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి తమవైన లక్ష్యాలు, కాలవ్యవధులు ఉంటాయి. అందుకే శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్, వివిధ రకాల రిటైర్మెంట్ అవసరాలకు తగ్గట్లుగా అనేక అనువైన ఆప్షన్లు అందిస్తుంది.

ముందుగానే ప్రారంభించండి: 35 ఏళ్ల వయసు నుంచే రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవడాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి కావడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది.

ఎప్పటి నుంచి ఆదాయం కావాలో మీరే ఎంచుకోవచ్చు
ఇమిడియేట్ యాన్యుటీ: రిటైర్ అయిన వెంటనే ఆదాయం ప్రారంభం.
డిఫర్డ్ యాన్యుటీ: చెల్లింపులు ప్రారంభమయ్యే ముందు 20 సంవత్సరాల వరకు నిధికి పెరిగే అవకాశాన్ని కల్పించడం ద్వారా మూలనిధిని పెంచుకోవచ్చు. PPTకి అదనంగా గరిష్ట స్థాయిలో 20 ఏళ్ల వరకు వాయిదా వేసే వీలు. ఉదాహరణకు పాలసీ ప్రీమియం చెల్లింపు వ్యవధి 12 ఏళ్లు అనుకుంటే, గరిష్టంగా 12 + 20 = 32 ఏళ్లు డిఫర్ చేసుకోవచ్చు.

సరళతర ప్రీమియం ఆప్షన్లు
ఏకమొత్తంగా చెల్లించవచ్చు
2–12 ఏళ్ల వరకు విడతలవారీగా చెల్లింపులు జరపవచ్చు

కుటుంబానికి రక్షణ
ఈ పథకం కేవలం మీ భవిష్యత్తు కోసం మాత్రమే కాదు, మీ కుటుంబ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. “రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్” ఆప్షన్‌ని ఎంచుకోవడం వల్ల పాలసీదారు మరణించిన తర్వాత కొనుగోలు కోసం మీరు మొదట చెల్లించిన మొత్తం తిరిగి నామినీకి లభిస్తుంది.

ఎవరికి అనుకూలం?
శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ వివిధ వర్గాలవారందరికీ అనుకూలమైనదిగా ఉంటుంది
ముందుగానే రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించాలనుకునే వారు (FIRE తరం)
ఆర్థిక స్వాతంత్య్రంతో జీవనశైలిని కొనసాగించాలనుకునే వారు
స్థిరమైన ఆదాయం, వృద్ధి అవకాశాలను కోరుకుంటూ, రిటైర్మెంట్‌కు సమీపిస్తున్న వారు
స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలు కోరుకునే రిటైరీలు
యాన్యుటైజేషన్ ఆప్షన్లను కోరుకునే NPS సభ్యులు
నిర్మాణాత్మకమైన, దీర్ఘకాలిక రిటైర్మెంట్ వ్యూహం కోరుకునే వ్యక్తులు

Videos

₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !

విరోష్ రిసెప్షన్‌లో రాజకీయ నాయకులు

చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ తిరుమలకు కల్తీ నెయ్యి

మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి.. మేము ఆడవాళ్ళం బొమ్మలు కాదు

హైదరాబాద్ టోలీచౌక్ లో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి

తిరుమల లడ్డూపై అపచారం.. నిజాల్ని చూపిస్తున్న గోవిందుడు

ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న పెద్ది రన్ టైం..!

Jaammalamadugu: యువతి హత్య కేసు 8 నెలలు గడుస్తున్నా వీడని మిస్టరీ

అచ్చెన్నాయుడి నోటి దురుసు... భయపడకండి లడ్డూ కోసం మాట్లాడును లెండి

ట్రంప్ కు జై కొట్టిన సెనేట్ వీగిపోయిన డెమొక్రాట్ల తీర్మానం

Photos

+5

భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ ప్రొద్దుటూరు పర్యటన (ఫొటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా వివాహంలో క్రికెట్‌, సినీ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

భద్రాచలం : రామయ్య పెళ్లి పసుపు దంచి.. తలంబ్రాలు కలిపి పెళ్లి పనులు ప్రారంభం (ఫొటోలు)

+5

విశాఖలో వైఎస్‌ జగన్‌.. పోటెత్తిన అంతులేని అభిమానం (ఫొటోలు)

+5

విరోష్ జంట రిసెప్షన్‌లో ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

#Virosh Reception: ఘనంగా విజయ్‌- రష్మిక రిసెప్షన్‌ (ఫోటోలు)

+5

'పీలింగ్స్‌..' పాటకు స్టెప్పులేసిన అనసూయ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో ఘనంగా హోలీ సంబరాలు (ఫొటోలు)

+5

అభిమానులతో 'విరోష్' జోడీ బంతి భోజనాలు (ఫొటోలు)