₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
Breaking News
సిబ్బంది పొరపాటు.. కిందపడిపోయిన నాగచైతన్య (వీడియో)
Published on Thu, 03/05/2026 - 15:01
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగచైతన్య కుర్చి నుంచి ఒక్కసారిగా కిందపడిపోయారు. తను హీరోగా నటిస్తున్ని కొత్త సినిమా 'వృషకర్మ' ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ మూవీ గ్లింప్స్ విడుదలలో భాగంగా ప్రసాద్ ఐమ్యాక్స్ పీసీఎక్స్ స్క్రీన్‌లో ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడేందుకు వేదికపై కుర్చీలను తీసుకొచ్చారు. నాగచైతన్యకు కేటాయించిన కుర్చిలో కూర్చోగానే అది ఒక్కసారిగా వంగిపోయింది.
దీంతో ఆయన వెనక్కిపడిపోయారు. వెంటనే చిత్ర యూనిట్ అప్రమత్తం కావడమే కాకుండా ఆయనకు ఏమైనా దెబ్బ తగిలిందేమోనని చూశారు. అంతలోనే చైతన్య కూడా ఎలాంటి గాయం కాలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. నాగచైతన్య మరో కుర్చిలో కూర్చొని మీడియా చిట్‌చాట్ కొనసాగించారు. ఈవెంట్ సిబ్బందిపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు వీడియోలో తెలుస్తోంది. తక్కువ సమయంలోనే ఆయన మళ్లీ తన పంధాలో సరదాగా నవ్వుతూ వేదికపై కనిపించారు.
Tags : 1