కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా!

Published on Thu, 03/05/2026 - 11:02

ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పా? అంతమాత్రానికే ఇలా నాకు నరకం చూపించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు యూట్యూబర్‌, హిందీ బిగ్‌బాస్‌ 17 ఫేమ్‌ అనురాగ్‌ దోభల్‌. కులాంతర వివాహం చేసుకున్న కారణంతో తన కుటుంబం తనను వెలేసిందని, ఇక తనకు చావే దిక్కని వాపోయాడు. ఈ మేరకు యూట్యూబ్‌లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు.

చిన్నప్పటినుంచి కష్టాలు
'గత కొన్నినెలలుగా నా జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జీవితం ఇంత దుర్భరంగా మారుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు. 14 ఏళ్ల వయసులోనే నాకు బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చింది. ఆ తర్వాత నా పేరెంట్స్‌ వారికి నచ్చిందే చదవాలని నాపై బలవంతం చేశారు. నేనేమో నా కలల్ని నిజం చేసుకోవడం కోసం డబ్బు కూడబెట్టేందుకు కష్టపడ్డాను. ట్యూషన్స్‌ చెప్పాను. నాకన్నా నా పేరెంట్స్‌ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను.

పెళ్లి ఇష్టం లేదు
సోషల్‌ మీడియా ద్వారా రితిక అనే అమ్మాయిని కలిశాను. తను నా అభిమాని అని పేర్కొంటూ రెండుమూడేళ్లపాటు మెసేజ్‌లు చేసింది. అలా ఒకరోజు ఆమె మెసేజ్‌కు రిప్లై ఇచ్చాను. అలా తనతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరం రెండేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి మా పెద్దలకు ఇష్టం లేదు. వారం రోజుల్లో పెళ్లి అనగా వేడుకకు రామని చెప్పేశారు. ఎంతగానో బతిమాలాను. బంధువులందరి ముందు చేతులెత్తి వేడుకున్నాను. 

వార్నింగ్‌
కాళ్లు పట్టుకుని క్షమించమని అడిగాను. అయినా వారి మనసు కరగలేదు. మేము సంతోషంగా లేము, మిమ్మల్నీ సంతోషంగా ఉంచము అని వార్నింగ్‌ ఇచ్చారు. మమ్మల్ని టార్చర్‌ పెట్టారు. నా దగ్గరున్నదంతా లాక్కున్నారు. పెళ్లయ్యాక ఇంట్లో కూడా అడుగుపెట్టనివ్వలేదు. చచ్చిపోవాలనుకున్నాను. నాకేదైనా అయితే అందుకు నా ఇంట్లోవాళ్లే కారణం.

బోరుమని ఏడ్చిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌
ఇప్పుడు రితిక కూడా నన్ను వదిలేసింది. నేను తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నాను. ఈ బాధను ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావట్లేదు. బహుశా ఈ వీడియో తర్వాత నేను కనిపించనేమో! ఐదు రోజులుగా ఏమీ తినలేదు. ప్రశాంతంగా నిద్రపోవాలనుంది. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను. కానీ బయటవాళ్లు చెప్పిందే నమ్మారు. నన్ను దూరం పెట్టారు. నేను చనిపోయాక అయినా నా బిడ్డను ఆదరించండి అని బోరుమని ఏడ్చాడు. ఇదే తన చివరి వ్లాగ్‌ అని అనురాగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అనురాగ్‌ భార్య గతేడాది సెప్టెంబర్‌లో గర్భం దాల్చింది.

చదవండి: చిరంజీవి సినిమాలో యాక్ట్‌ చేస్తున్నా: బండ్ల గణేశ్‌

Videos

₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !

విరోష్ రిసెప్షన్‌లో రాజకీయ నాయకులు

చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ తిరుమలకు కల్తీ నెయ్యి

మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి.. మేము ఆడవాళ్ళం బొమ్మలు కాదు

హైదరాబాద్ టోలీచౌక్ లో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి

తిరుమల లడ్డూపై అపచారం.. నిజాల్ని చూపిస్తున్న గోవిందుడు

ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న పెద్ది రన్ టైం..!

Jaammalamadugu: యువతి హత్య కేసు 8 నెలలు గడుస్తున్నా వీడని మిస్టరీ

అచ్చెన్నాయుడి నోటి దురుసు... భయపడకండి లడ్డూ కోసం మాట్లాడును లెండి

ట్రంప్ కు జై కొట్టిన సెనేట్ వీగిపోయిన డెమొక్రాట్ల తీర్మానం

Photos

+5

భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ ప్రొద్దుటూరు పర్యటన (ఫొటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా వివాహంలో క్రికెట్‌, సినీ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

భద్రాచలం : రామయ్య పెళ్లి పసుపు దంచి.. తలంబ్రాలు కలిపి పెళ్లి పనులు ప్రారంభం (ఫొటోలు)

+5

విశాఖలో వైఎస్‌ జగన్‌.. పోటెత్తిన అంతులేని అభిమానం (ఫొటోలు)

+5

విరోష్ జంట రిసెప్షన్‌లో ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

#Virosh Reception: ఘనంగా విజయ్‌- రష్మిక రిసెప్షన్‌ (ఫోటోలు)

+5

'పీలింగ్స్‌..' పాటకు స్టెప్పులేసిన అనసూయ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో ఘనంగా హోలీ సంబరాలు (ఫొటోలు)

+5

అభిమానులతో 'విరోష్' జోడీ బంతి భోజనాలు (ఫొటోలు)